జియో సినిమా యాప్ మరోసారి హాట్ స్టార్ కంటెంట్ పై కన్నేసింది. ఇప్పటికే ఐపీఎల్ ని సొంతం చేసుకున్న జియో సినిమా.. ఇప్పుడు ఏకంగా హాట్ స్టార్ లో ప్రతిష్టాత్మక కంటెంట్ ను సొంతం చేసుకుంది రిలయన్స్. ఇంతకే ఆ కంటెంట్ ఏంటంటే?
భారతదేశంలో నంబర్ వన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ గా ఎదిగేందుకు జియో సినిమా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచులతో యావత్తు భారతదేశ యూజర్లను తనవైపు లాక్కున్న జియో.. ఇప్పుడు హాలీవుడ్ కంటెంట్ మీద ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జియో సినిమా యాప్ లో సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ షోస్ వంటి కంటెంట్ ని తీసుకొస్తున్నట్లు ప్రకటించిన రిలయన్స్ సంస్థ.. త్వరలో హాలీవుడ్ కంటెంట్ ను కూడా చేర్చనుంది. ఈ మేరకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ వయాకామ్ 18 సంస్థ.. వార్నర్ బ్రదర్స్ సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, రానున్న హ్యారీ పోటర్ సిరీస్, సక్సెషన్ వంటి హెచ్బీఓ కంటెంట్ ను కూడా యాప్ లోకి తీసుకురానుంది.
అయితే ఈ డీల్ కోసం జియో సినిమా ఎంత ఖర్చు చేసిందన్నది ఇంకా బయటకు రాలేదు. వార్నర్ బ్రదర్స్, రిలయన్స్ వయాకామ్ 18 మధ్య భాగస్వామ్యం అనేది చాలా ప్రత్యేకమని.. వార్నర్స్ సంస్థ యొక్క దాదాపు ఎక్కువ కంటెంట్ జియో సినిమా యాప్ లో అప్లోడ్ చేయనున్నారు. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్ స్టార్ లాంటి పెద్ద సంస్థలు ఉన్నా కూడా వార్నర్ సంస్థ వాటితో భాగస్వామ్యం అవ్వడానికి ఆసక్తి చూపించలేదని సమాచారం. ఈ ఒప్పందం జియో సినిమాను హౌస్ ఆఫ్ వార్నర్ గా, భారత్ లో హెచ్బీఓగా తయారు చేస్తుందని చెబుతున్నారు. ఈ ఒప్పందంతో జియో సినిమా వేల గంటల స్ట్రీమింగ్ కంటెంట్ ను తీసుకురానుంది.
ఇప్పటికే ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను జియో సినిమా యాప్ లో ఉచితంగా ప్రసారం చేస్తున్న రిలయన్స్ వయాకామ్ 18.. కోట్లలో సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. మే 28తో ఐపీఎల్ సీజన్ ముగియనుంది. ఐపీఎల్ కారణంగా వచ్చిన సబ్స్క్రైబర్లకు వినోదం అందించేలా జియో సినిమాలో దేశీయ కంటెంట్ తో పాటు ఇప్పుడు హాలీవుడ్ కంటెంట్ ని కూడా తీసుకొస్తున్నారు. దీంతో నెట్ ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు గట్టి షాక్ తగలనుంది. నెట్ ఫ్లిక్స్ అనేది స్థానిక కంటెంట్ ని ప్రొవైడ్ చేయడంలో విఫలమైంది. ఈ క్రమంలో జియో సినిమా స్థానిక భాషల కంటెంట్ తో పాటు హాలీవుడ్ కంటెంట్ ని ప్రొవైడ్ చేయడం ద్వారా సబ్స్క్రైబర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటి వరకూ హాట్ స్టార్ లో వచ్చిన వార్నర్ బ్రదర్స్, హెచ్బీఓ, మ్యాక్స్ ఒరిజినల్ కంటెంట్ ఇక నుంచి జియో సినిమాలో ప్రత్యక్షం కానుందన్న మాట. మొన్న ఐపీఎల్ తో డిస్నీ+హాట్ స్టార్ కి షాకిచ్చిన జియో సినిమా, ఇప్పుడు హాలీవుడ్ కంటెంట్ ను మరోసారి షాకిచ్చింది. ఐపీఎల్ ఒప్పందం 2023 నుంచి 2027 వరకూ కొనసాగనుంది. 2.9 బిలియన్ డాలర్లు వెచ్చించి మరీ ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది రిలయన్స్ వయాకామ్ 18. ఇప్పుడు హాలీవుడ్ కంటెంట్ కోసం ఎంత వెచ్చించిందో అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో నంబర్ వన్ గా ఎదగాలని చూస్తున్న రిలయన్స్ సంస్థపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
BREAKING: Ambani’s Jio Cinema strikes a multi-year deal with Warner Bros and HBO to stream their content in INDIA including Succession, Game of Thrones, upcoming Harry Potter Series and many more landmark series.
This is game-changing, unexpected! pic.twitter.com/cPNcBj7rAB
— LetsCinema (@letscinema) April 27, 2023