క్యాప్సికమ్ తినడానికి ఇప్పటి జనాలలో చాలామంది మొఖం విరుస్తారు. అటు టేస్ట్ పరంగానే కాదు ఆరోగ్య పరంగాను అధ్బుతాలు సృష్టిస్తుంది. ఒక్కసారి క్యాప్సికమ్ లోని పోషకాల సీక్రెట్ తెలుసుకుంటే క్యాప్సికమ్ వదిలిపెట్టరు. దీంట్లో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీర బరువును తగ్గిస్తాయి. ఏజ్డ్ లుక్ ను దూరం చేస్తాయి. చర్మవ్యాధులను మటుమాయం చేస్తాయి. చర్మంపై ముడతలు చర్మం పొడిబారడం వంటి సమస్యలను క్యాప్సికమ్ ఈజీగా నయం చేస్తుంది. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ బారి నుంచి శరీరాన్ని కాపాడతాయి. క్యాప్సికమ్ క్యాటరాక్ట్, ఆస్టియో ఆర్థరైటిస్ బారినపడకుండానూ శరీరాన్ని రక్షిస్తుంది.
మోకాలి నొప్పికి క్యాన్సికమ్ చక్కని పరిష్కారి. ఇందుల్లో ఉండే పొటాషియం, ఐరన్ కడుపు ఉబ్బసం, గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. చాలామంది బాధపడుతోన్న సమస్య అధిక బరువు. బరువు తగ్గాలనుకునే వారు క్యాప్సికమ్ఆ హారంలో చేర్చుకుంటే చాలు బరువు ఈజీగా తగ్గుతారు.
క్యాప్సికంను కూడా వారు రోజూ ఆహారంలో తీసుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. క్యాప్సికంలో ఆల్ఫా గ్లూకోజైడేజ్, లైపేజ్ అనే రెండు ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి కార్పొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. దీంట్లోని విటమిన్-సి శరీరం ఇనుమును గ్రహించేలా చేస్తుంది.
కాప్సికం – వెజ్ కార్వింగ్ కోసం ఈ వీడియో చూడండి.