ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది తమ వినూత్న ప్రదర్శనలతో ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రి రాత్రే స్టార్ హూదా తెచ్చుకుంటున్నారు.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతోమంది తమ టాలెంట్ తో రాత్రి రాత్రే స్టార్లు అవుతున్నారు. సాధారణంగా కాకుండా వినూత్నంగా సాధించిన విజయాలు, సరికొత్త ఆవిష్కరణలు గిన్నిస్ రికార్డ్ లో పొందుపరుస్తారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో సాధించిన ఘన విజయాలను ఈ గిన్నిస్ బుక్ లో రికార్డ్ చేస్తారు. అయితే ఓ మహిళ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసింది? ఏ రికార్డ్ సాధించింది? వివరాలలోకి వెళితే..
నైజీరియాకు చెందిన ఓ మహిళా చెఫ్ హిల్దా బాసి ఏకంగా 100 గంటలపాటు వంట చేసి రికార్డ్ సృష్టించింది.అంతకు ముందు భారత చెఫ్ 87 గంటల 45 నిమిషాలపాటు వంటచేసిన రికార్డును బద్దలు కొట్టింది హిల్దా బాసి.లండన్ కాలమానప్రకారం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వంట చేయడం ప్రారంభించింది. వంద గంటలు ఆమె వంట చేస్తూనే ఉంది. సోమవారం రాత్రి 7.45 నిమిషాలకు పూర్తి చేసింది. ప్రతి గంటకు 5 నిమిషాలపాటు విశ్రాంతి తీసుకుంటూ వంట చేసింది.హిల్దా బాసి ఇప్పుడు దేశంలోనే ప్రసిద్ధి గాంచింది.
వేలకొద్ది మంది ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని చూడడానికి లెక్కి ప్రాంతానికి వచ్చారు.ఆమెను వంటచేస్తున్నప్పుడు పాటలు పాడి ఎంకరేజ్ చేశారు. రికార్డ్ పూర్తయిన తర్వాత ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె చేస్తున్న వంటలను ఆన్ లైన్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.దీంతో నైజీరియా వంటకాలు ప్రపంచానికి చాటి చెప్పడానికి అవకాశం కలిగిందని హిల్దా బాసి పేర్కొంది.ఆమె చేసిన వంటలన్నీ అక్కడికి వచ్చిన వారికి ఫ్రీ గా ఇచ్చేసింది.100 గంటల పాటు వంట చేసి గిన్నిస్ రికార్డ్ సాధించింది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.