స్వయం శక్తితో ఎదగాలి… జీవితంలో అభివృద్ధి చెందాలని భావించే మహిళలకు భారతీయ స్టేట్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఏకంగా 20 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం కల్పిస్తోంది. అయితే అందరూ దీనికి అర్హులు కారు. కేవలం స్వయం సహాయక బృందాలకు మాత్రమే ఈ లోన్ ఆఫర్ వర్తిస్తుంది. అది కూడా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలను అందిస్తోంది. ఎస్‌హెచ్‌జీ సమూహ్ శక్తి క్యాంపైన్‌లో భాగంగా.. ఎస్‌బీఐ స్వయం సహాయక బృందాలకు రూ.10 లక్షల వరకు రుణం ఇస్తోంది. ఎస్‌బీఐ2 022 అక్టోబర్ 1న ఎస్‌హెచ్‌జీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
ఎస్‌బీఐ ఎస్‌హెచ్‌జీ సమూహ్ శక్తి ప్రోగ్రామ్‌లో భాగంగా అన్ని జిల్లాల్లోని మహిళా గ్రామీణ స్వయం సహాయక బృందాలు.. కేవలం 7 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు తీసుకునే వారికి ఒక ఏడాది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ వర్తిస్తుంది. ఇక రూ.5 లక్షల పైన రుణాలు తీసుకోవాలనుకుంటే.. ఆ మొత్తంపై 9 శాతం వడ్డీ వర్తిస్తుంది. స్వయం సహాయక సంఘాలకు రూ.10 లక్షల పరిమితి వరకు ఎటువంటి పూచీకత్తు, మార్జిన్ లేకుండా రుణం మంజూరు చేస్తోంది ఎస్‌బీఐ. వీటిపై డిపాజిట్ చేయమని ఒత్తిడి చేయదు.
ఇది కాక అన్ని జిల్లాల్లోని మహిళా గ్రామీణ బృందాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు లోన్ తీసుకుంటే.. వారికి క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ కవరేజీ లభిస్తుంది. ఎస్‌బీఐ 2022 మార్చి 31 వరకు సుమారు 8.71 లక్షల స్వయం సహాయక బృందాలకు రూ.24,023 కోట్ల రుణాలను మంజూరు చేసింది. అయితే ఇలా రుణాలు తీసుకున్నవారిలో 91 శాతం మంది మహిళలే కావడం విశేషం. అలానే 2022 మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్న ఎస్‌హెచ్‌జీ రుణాల్లో 25.25 శాతం వాటాతో ఎస్‌బీఐ రికార్డు సృష్టించింది.
స్వయం సహాయక బృందాలకు వారి మొత్తం క్రెడిట్ అవసరాలను తీర్చడానికి గాను ఎస్‌బీఐ బ్యాంకు ఈ రుణాలను అందిస్తుంది. వీటిలో ఆదాయం పెంచే కార్యకలాపాలు, విద్య, గృహనిర్మాణం, పెళ్లి, రుణ మార్పిడి లాంటి సామాజిక అవసరాలు ఉన్నాయి. ఎస్‌బీఐ.. ఎస్‌హెచ్‌జీలకు టర్మ్ లోన్‌లు, క్యాష్ క్రెడిట్ లిమిట్స్ రెండింటినీ ఇస్తుండటం విశేషం. స్వయం సహాయక బృందాల కోసం ఎస్‌బీఐ మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
SBI is empowering Self-help Groups (SHGs) with excellent benefits on credit facilities.
Learn more about it: https://t.co/uh5PSKRxIv#SBI #AmritMahotsav #CreditFacility #SelfHelpGroup #Finance #MeraSHGMeraBank pic.twitter.com/PQBIkZA4Pp
— State Bank of India (@TheOfficialSBI) January 15, 2023