భారత దేశ వ్యాప్తంగా అత్యధిక బ్రాంచ్‌లతో ప్రజలకు సేవలందిస్తున్న బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’. కస్టమర్లకు అప్పుడప్పుడు ఆఫర్లు కూడా ప్రకటిస్తుంది. తక్కువ వడ్డీ రేట్లకే లోన్ తీసుకునే సదుపాయం కల్పిస్తుంది.
దేశ వ్యాప్తంగా అతిపెద్ద బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ కస్టమర్లకు శుభవార్త తెలిపింది. లోన్ తీసుకున్న వారికి తక్కువ వడ్డీ రేట్లతో కొత్త పథకం తీసుకువచ్చింది. ఈస్కీమ్ ద్వారా తక్కువ వడ్డీకే సుమారు 25 బేసిస్ పాయింట్ల వరకు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. SBI ఇంతకు ముందుకూడా కొత్త స్కీమ్స్ తీసుకువచ్చింది. ఈ బ్యాంక్ తీసుకువచ్చిన కొత్త స్కీమ్ ఏంటి? ఎవరు అర్హులు? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయన్న వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
SBIలో లోన్ తీసుకునేవారికి ఆ బ్యాంక్ ఓ అదిరిపోయే గుడ్‌న్యూస్ తెలిపింది. ఈ బ్యాంకు ఇచ్చిన ఆఫర్ వల్ల రున గ్రహీతలు ఊరట పొందనున్నారు. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఓ అవకాశం కల్పిస్తోంది. గ్రీస్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో యూనిట్లు కొనుగోలు చేసే వారికి స్పెషల్ స్కీమ్ తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతుంది. దీనితో చాలా మందికి ఊరట లభిస్తుంది. ఈ స్కీమ్‌తో కొత్త ఇంటి కోసం లోన్ తీసుకునే వారికి కొంత లాభం చేకూరుతుంది. గ్రీన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ కొంటే కొన్ని అదనంగా లాభాలున్నాయి. అవేంటో వివరాలు తెలుసుకుందాం.
సామాన్యులకు సొంతికల నెరవేరాలనే కాన్సెప్ట్‌తో SBI ఓ కొత్త స్కీమ్ మీ ముందుకు తెస్తుంది. SBI ఇంతకు ముందు కూడా ఇలాంటి స్కీమ్‌లు తీసుకువచ్చింది.
గ్రీన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో హౌస్ కొనుగోలు చేసిన వారికి హోమ్ లోన్స్‌పై 10 నుండి 25 బేసిస్ పాయింట్ల దాకా తక్కువ వడ్డీ రేటు చెల్లించవచ్చు. దీంతో గృహ రుణం వడ్డీ రేట్లు భారీగా తగ్గిస్తున్నారని తెలుస్తుంది. గతంలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీ రేట్లతో స్కీమ్ తెచ్చింది. 2018లో దానిని ఎత్తివేసింది. ప్రస్తుతం అలాంటి స్కేమ్ తిరిగి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది. ‘SBI గ్రీన్ హోమ్’ పేరుతో 2009-10లో కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. పర్యావరణానికి అనుకూల రెసిడెన్షియల్ ప్రాజెక్టు డెవలపర్లకు ఈ స్కీమ్ ఊతమిచ్చింది. ఈ స్కీమ్‌తో ఇంటి కొనుగోలుదారులకు తక్కువ వడ్డీతో హోమ్ లోన్స్ పొందనున్నారు.
గ్రీన్ ప్రాజెక్టుల ద్వారా 30 శాతం ఎలక్ట్రిసిటీ, 30 నుండి 50 శాతం వాటర్ ఆదా అవుతాయని అంటున్నారు. దీంతో ప్రజలు గ్రీన్ హోమ్ ప్రాజెక్టులను ఆదరిస్తున్నారు. అందువల్ల స్టేట్ బ్యాంక్ మరోసారి గ్రీన్ హోమ్ స్కీమ్ తీసుకురావాలని అనుకుంటోంది. ప్రైవేటు ఫైనాన్షియల్ సంస్థలు కూడా గ్రీన్ హోమ్ ప్రాజెక్టులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. SBI గ్రీన్ ప్రాజెక్టు ద్వారా రుణ గ్రహీతలకు తీపి కబురు తెలిపిందనే చెప్పాలి.