మనం సాధారణంగా సినిమాల్లో కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం. అవేంటంటే ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు అయినట్లు.. ఒక్క రాత్రి బికారి అయినట్లు చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే అదే ఘటన నిజ జీవితంలో జరిగితే? అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. లక్ష కోట్లు కోల్పోతే? వినడానికే చాలా ఆశ్చర్యంగా, నమ్మశక్యం కాకుండా ఉంది కదా? కానీ, అది నిజంగానే నిజ జీవితంలో జరిగింది. ఒక యంగ్ సీఈవో ఒక్క రోజులో తన ఆస్తిలోని 94 శాతాన్ని కోల్పోయాడు. రూ.1.22 లక్షల కోట్ల ఆస్తి.. ఒక్క రాత్రిలో రూ.19 వేల కోట్లకు చేరింది. మరో వారెన్ బఫెట్‌గా పేరు గాంచిన యంగ్ సీఈవో, అమెరికా యువ వ్యాపారవేత్త సామ్ బ్యాంక్‌మ్యాన్- ఫ్రైడ్ కథే ఇది.
వెళ్తే క్రిప్టో కరెన్సీ గురించి అందరికీ తెలిసిందే. అది బ్లాక్ చెయిన్ ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రిప్టోల కరెన్సీపై బ్యాంకులు, ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ అధికారాలు ఉండవు. డిమాండ్- సప్లయ్ ఆదారంగా ఇది పనిచేస్తుంది. అయితే క్రిప్టో కరెన్సీలో చాలా రకాలే ఉన్నాయి. బిట్ కాయిన్, ఇథీరియం, బినాన్స్ కాయిన్, ఎఫ్ టీఎక్స్, రిపుల్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే అందరికీ బిట్ కాయిన్ గురించి బాగా తెలుసు. దాని విలువ అయితే ప్రస్తుతం రూ.13 లక్షలపైనే ఉంది. అయితే మరో వారెన్ బఫెట్ గా పేరు గాంచిన ఎఫ్ టీఎక్స్ ఫౌండర్ ఈసీవో, ఇన్వెస్టర్ సామ్ బ్యాంక్ మ్యాన్- ఫ్రైడ్ గురించి బిజినెస్ లోకానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేని పేరు. ఆయన సంపద విలువ 15 బిలియన్ డాలర్లు ఉండేది.
Insane 24 hours can change your life.
FTX CEO SAM BANKMAN FRIED HAS GONE BANKRUPT HE PERSONALLY STILL OWES OVER $650 MILLION TO LENDERS.
— Nathan Michaud (@InvestorsLive) November 9, 2022
అయితే అతని ఎఫ్ టీఎక్స్ కంపెనీని ప్రత్యర్థి కంపెనీ అయిన బినాన్స్ కు విక్రయిస్తున్నట్లు ప్రకటించారు. ఇంకేముంది ప్రకటన చేసిన తర్వాత ఒక్కరోజులో సామ్ బ్యాంక్ మ్యాన్ ఆస్తుల విలువ కేవలం బిలియన్ డాలర్లకు చేరుకుంది. బినాన్స్ హెడ్ చాంగ్ పెంగ్ జావో మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ప్లాట్ ఫామ్ బినాన్స్.. ఎఫ్ టీఎక్స్ కంపెనీని కొనేందుకు ఆసక్తి చూపిస్తోంది. అందుకు తగిన డీల్ కూడా ఓకే అయ్యిందంటూ వెల్లడించారు. ఆ ప్రకటనే తర్వాత సామ్ ఆస్తులు పతనం అయ్యాయి. చరిత్ర పుటల్లో 94 శాతం ఆస్తులు ఆవిరైన తొలి బిలియనీర్ గా సామ్ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని చెబుతున్నారు.
Sam Bankman-Fried was featured on Nas Daily before, was once a billionaire because of FTX, but today his asset is negative $200 million according to some sources because of bankruptcy. pic.twitter.com/uwMA1dOaVp
— Libs of Vorz (@libsofvorz) November 10, 2022