దేశంలో అగ్రగామి టెలికాం సంస్థగా వెలుగొందుతోన్న రిలయన్స్ జియో తన పోర్ట్ ఫోలియోలో మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను జత చేసింది. సింపుల్ గా చెప్పాలంటే.. రెండు కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్లను వినియోగదారుల కోసం లాంచ్ చేసింది. ఈ రెండు ప్లాన్స్ కూడా అధిక డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటుగా మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి. జియో కొత్తగా లాంచ్ చేసిన అన్‌లిమిటెడ్ ప్లాన్స్ మరియు వాటి ప్రయోజనాలు ఏంటి అన్నది తెలుసుకుందాం..
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, 2.5జీబీ రోజువారీ డేటా పొందుతారు. అంటే, 30 రోజుల్లో మొత్తం మీద 75జీబీ డేటా వినియోగించుకోవచ్చు. రోజువారీ డేటా యూసేజ్ లిమిట్ ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64kbpsకి పడిపోతుంది. అలాగే, జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ ఉచితంగా లభిస్తాయి. వెల్ కమ్ ఆఫర్ కింద 5జీ సేవలను సైతం పొందొచ్చు.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, 2.5జీబీ రోజువారీ డేటా పొందుతారు. అంటే, 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 జీబీ హై స్పీడ్ డేటా వినియోగించుకోవచ్చు. రోజువారీ డేటా యూసేజ్ లిమిట్ ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64kbpsకి పడిపోతుంది. అలాగే, జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్ లోనూ 5జీ సేవలు వినియోగించుకోవచ్చు.
మరోవైపు రిలయన్స్ జియో ఇప్పటి వరకు 100కు పైగా పట్టణాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల, తిరుపతి, నెల్లూరు, ఏలూరు పట్టణాల్లోని వినియోగదారులు జియో 5జీ సేవలు వినియోగించుకోవచ్చు. జియో తీసుకొచ్చిన ఈ రెండు ప్లాన్లపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.