ఏదైనా వ్యాపారంలో అద్భుతంగా రాణించాలంటే ఆ వ్యాపారానికి సంబంధించి మార్కెటింగ్ టెక్నిక్స్ తెలియడంతో పాటు.. బ్రాండ్ ప్రమోషన్ కూడా కీలకం. ఈ పనులు సరిగా చేయనట్లయితే ఆ వ్యాపారం మూతపడ్డట్లే. సరిగ్గా ‘డబ్‌స్మాష్’ యాప్ విషయంలో ఇదే జరిగింది. డబ్‌స్మాష్ యాప్ ఏంటి అని ఆలోచిస్తున్నారా?. ఇది కూడా షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్. టిక్ టాక్ కన్నా ముందు వచ్చింది. జనాలను విపరీతంగా ఆకర్షించింది. యాప్ ని అభివృద్ధి చేసిన వారికి లాభాల పంట పండించింది అయితే ఎప్పుడైతే టిక్ టాక్ ఎంట్రీ ఇచ్చిందో.. డబ్‌స్మాష్ కు ఆదరణ తగ్గుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం టిక్ టాక్ దీని గురుంచి తెలియని వారుండరు. రెండేళ్ల క్రితం ఎటు చూసినా టికే టాక్ మాయే.. ఎక్కడ చూసినా టిక్ టాక్ స్టార్లే. కానీ ఈ టిక్ టాక్ కంటే ముందే వచ్చిన డబ్ స్మాష్ యాప్ గురుంచి పెద్దగా ఎవరికి తెలియదు.
టిక్‌టాక్ రాకముందే, డబ్‌స్మాష్ వినియోగదారులలో అత్యంత ప్రజాదరణ పొందిన షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్. అయితే, టిక్‌టాక్ అమలులోకి వచ్చిన వెంటనే డబ్‌స్మాష్ ప్రజాదరణ తగ్గింది. ఈ క్రమంలో రెడ్డిట్ సంస్థ ఏడాది క్రితం డబ్‌స్మాష్ ను కొనుగోలు చేసింది. అయినా దాని ఫేట్ మారలేదు. క్రమంగా జనాలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్‌టాక్ కు అలవాటు పడ్డారు. పైగా డబ్‌స్మాష్ గురించి కంపెనీపెద్దగా ప్రచారం చేయకపోవడం. దీంతో ఈ వీడియో ప్లాట్‌ఫామ్ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోలేకపోయింది. ఈ క్రమంలో దీన్ని పూర్తిగా మూసేస్తున్నట్లు రెడ్డిట్ సంస్థ ప్రకటించింది.‘ఫిబ్రవరి 22, 2022, డబ్‌స్మాష్ యాప్ కి చివరి రోజు. ఫిబ్రవరి 2022 తర్వాత ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉండదని.. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న వారికీ కూడా ఇవాల్టి నుంచి పనిచేయడం ఆగిపోతుందని’ కంపెనీ పేర్కొంది. డబ్‌స్మాష్ యాప్ ను నవంబర్ 14, 2014న జోనాస్ డ్రూప్పెల్, రోలాండ్ గ్రెంకే, డేనియల్ టాస్చిక్ అనే ముగ్గురు వ్యక్తులు జర్మనీలో స్థాపించారు. తరువాత ఈ కంపెనీ హెడ్ ఆఫిస్ ని 2016 లో జర్మనీ నుండి బ్రూక్లిన్‌కు మార్చారు. అయితే, 2020లో రెడ్దిట్ సంస్థ.. డబ్‌స్మాష్ ని కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. డబ్‌స్మాష్ అందుబాటులోకి వచ్చిన మొదటి రోజుల్లో యువకులను, సంగీత ప్రియులను భాగా అలరించింది. ప్రస్తుతం బాగా ఆదరణ ఉన్న సోషల్ మీడియా ‘రీల్స్’ ఫీచర్ లో అందరికంటే ముందుగా వచ్చిన డబ్‌స్మాష్..అంతే వేగంగా కూడా కనుమరుగవ్వడం దురదృష్టకరం.
Dubsmash, launched in 2014, may be remembered as less successful version of TikTok, the short-form video phenomenon. Reddit Inc. acquired the app in December 2020. Now, not much more than a year later, Reddit is shutting down Dubsmash after absorbing much of its functionality. pic.twitter.com/cYJmHLg5fW
— Marketing Mind (@MarketingMind_) February 23, 2022
Dubsmash is gone!! The end of an era pic.twitter.com/IZBXJy4UwO
— Jotaro Kujo (@mrs_jotaro) February 22, 2022