భారత ప్రభత్వం ఇప్పటి వరకు కరెన్సీ నోట్లపై కేవలం మహాత్మ గాంధీ ఫోటోలను మాత్రమే ముద్రించింది. అయితే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ల చిత్రాలను కరెన్సీ నోట్లపై ముద్రించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ భావిస్తున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అలాంటి వదంతులపై తాజాగా ఆర్బీఐ క్లారీటి ఇచ్చింది. నోట్ల మార్పు గాంధీజీ ఫోటో మార్పు ప్రతిపాదనలేవి లేవని కుండబద్ధలు కొట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రానికి బదులుగా రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం వంటి ఫోటోలతో కొత్త నోట్లను తీసుకొచ్చేందుకు ఆర్బీఐ, కేంద్ర ఆర్థికశాఖ సన్నాహకాలు చేస్తున్నట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లే ఈ వార్తలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయ్యాయి. ఈ కొత్త ప్రతిపాదనకు సంబంధించి ప్రణాళికలు ,డిజైన్లు కూడా పూర్తయినట్లు వదంతులు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై కేంద్ర బ్యాంకు స్పందించి.. వదంతులను కొట్టిపారేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటను విడుదల చేసింది.
ఇదీ చదవండి: కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే.. లోన్ కట్టాలంటూ మైనర్ బాలికకు నోటీసులు!
” ప్రస్తుతమున్న కరెన్సీ నోట్లకు మార్పులు చేస్తున్నామని, గాంధీ ఫోటోకు బదులుగా ఇతరుల చిత్రాలతో నోట్లను ముద్రించనున్నామని కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. కానీ అలాంటి ప్రతిపాదనేదీ లేదు” అని RBI స్పష్టం చేసింది. మరి… ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.