పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఉండరు. పానీ పూరికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మన దేశంలో చాలా ప్రాముఖ్యత గల స్ట్రీట్ ఫుడ్. ఏ నీళ్లు వాడతారో తెలియదు. కానీ ఆ పానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. పానీ పూరి అబ్బాయ్, అతని ఆ చేతులు ఆ పానీ డ్రమ్ములో ముంచి తీస్తుంటే.. ఆ రుచే వేరు. అంత చిరాగ్గా చేసినా కూడా ఎగబడి తినే జనం ఉన్నారు ఈ సొసైటీ ఆఫ్ ఇండియాలో. మరి ఇంత డిమాండ్ ఉన్న బిజినెస్ ని మీ స్టైల్ లో చేసి లాభాలు గడించాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ఆర్టికల్. పానీ పూరి వ్యాపారమా? అని తక్కువ అంచనా వేయకండి. మిమ్మల్ని చులకన చేస్తారని అస్సలు అనుకోకండి. చేసే పనిలో నిజాయితీ ఉండాలే గానీ ఏ పని చేసినా తప్పు కాదు.
ఎవరో ఏదో అంటారు? అని ఆగిపోవడం కంటే మనమే మన గురించి ఏదో ఒకటి అనుకుని కసిగా ఏదో ఒకటి చేసి ఎదగాలి. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే తమ ఉద్యోగాలని వదిలేసి ఇష్టమైన ఫుడ్ బిజినెస్ లు చేస్తూ లక్షల్లో గడిస్తున్నారు. నచ్చిన సమయంలో నచ్చినంత సమయం పని చేసుకోవచ్చు. ఒత్తిడి ఉండదు. టార్గెట్ ఉండదు. ఎక్కువ సమయం కష్టపడాల్సిన అవసరం ఉండదు. పైగా పానీ పూరి బిజినెస్ సాయంత్రం నుంచి మొదలవుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8, 9 గంటల వరకూ జనం తినడానికి వస్తూనే ఉంటారు. షాపింగ్ మాల్స్ పక్కన చిన్నగా పానీ పూరి బండి పెట్టుకుంటే విపరీతమైన లాభాలు ఉంటాయి. పానీ పూరి మేకింగ్ మెషిన్ ద్వారా అయితే పని సులువుగా ఉంటుంది. మెషిన్ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందికి సప్లై చేయవచ్చు. మీకు పానీ పూరి చేయడం రాకపోయినా.. ఆ పని తెలిసిన మనిషిని పెట్టుకోవచ్చు. మీరు యజమానిగా ఉంటూ.. కస్టమర్స్ కి అందివ్వడం, బిల్లింగ్స్ చూసుకుంటే చాలు.
నగరాల్లో నివసించే మనుషులు తినే ఫుడ్డు శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. చేతికి గ్లౌజులు వేసుకుని.. చేతులతో టచ్ చేయకుండా మెషిన్ల ద్వారా చేసిన ఫుడ్ నే ఇష్టపడుతున్నారు. పైగా మెషిన్ల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి సర్వ్ చేయవచ్చు. కాబట్టి మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే ఈ పానీ పూరి వ్యాపారం మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. చూడండి మాష్టారు.. ఇప్పటి వరకూ మీరు ఎన్నో నష్టపోయిన బిజినెస్ లని చూసి ఉంటారు. కానీ పానీ పూరి బిజినెస్ చేసి నష్టపోయిన మనిషిని చూసి ఉండరు. పానీ పూరి బిజినెస్ కి ఉన్న క్రేజ్ అదే. దాన్ని నమ్ముకున్న వారికి ఆ పానీ పూరి ఎప్పుడూ హ్యాండ్ ఇవ్వదు. మరి పానీ పూరి బిజినెస్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.