మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. సమాజంలో మహిళల పాత్ర, వారు సాధించిన విజయాలకు గాను అభినందనలు తెలుపుతూ ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీ భార్యకు ఏదైనా అద్భుతమైన బహుమతి ఇవ్వాలని భావిస్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. మీరు ఉన్నా లేకున్నా.. మీ భార్యకు ప్రతి నెల నిలకడైనా ఆదాయం రావాలంటే ఆమె పేరు మీద నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో (ఎన్పీఎస్) పెట్టుబడి పెట్టండి. నెలవారీ ఆదాయం అందించండి.
మీరు మీ భార్య పేరు మీద కొత్త పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ ఖాతాను ఓపెన్ చేసి నెలా నెలా డబ్బు పొదుపు చేసే.. మీ భార్యకు 60 ఏళ్లు నిండిన తర్వాత ఒకేసారి భారీ మొత్తంలో డబ్బు అందజేస్తుంది. అంతేకాకుండా ప్రతినెలా పెన్షన్ రూపంలో నిలకడైన ఆదాయం ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఎన్పీఎస్ ఖాతాతో మీరు మీ భార్యకు ప్రతి నెల ఎంత పెన్షన్ పొందాలో కూడా నిర్ణయించవచ్చు. దీంతో మీ భార్య 60 ఏళ్లు దాటిన తర్వాత డబ్బు కోసం ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ ఖాతాలో మీ సౌలభ్యం ప్రకారం ప్రతి నెల డబ్బు జమ చేయవచ్చు. కేవలం రూ.1,000తో మీ భార్య పేరు మీద ఎన్పీఎస్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ ఎన్పీఎస్ ఖాతా మీ భార్యకు 60 సంవత్సరాల వయస్సులో మెచ్యూర్ అవుతుంది. అప్పుడు ఒకేసారి భారీ మొత్తంలో డబ్బు, నెలా నెలా పెన్షన్ వస్తుంది.
ఉదాహరణకు.. మీ భార్యకు 30 వ ఏట మీరు ఆమె పేరుపై ఎన్పీఎస్ ఖాతా తెరిచారు అనుకుందాం. మీరు ఈ ఖాతాలో ప్రతి నెలా రూ. 5000 పెట్టుబడి పెట్టండి. ఏటా పెట్టుబడిపై 10 శాతం రాబడి వస్తే 60 ఏళ్ల వయసులో ఆమె ఖాతాలో మొత్తం రూ.1.12 కోట్లు ఉంటాయి. ఇందులో దాదాపు 45 లక్షల రూపాయలు వారికి అందుతాయి. ఇది కాకుండా వారు ప్రతి నెలా దాదాపు రూ.45,000 పింఛను పొందడం ప్రారంభిస్తారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే వారు జీవితాంతం ఈ పెన్షన్ పొందుతూనే ఉంటారు. మీరు కావాలనుకుంటే ఖాతా మెచ్యూర్ కాలాన్ని 65 సంవత్సరాల వరకు కూడా పెట్టుకోవచ్చు. అంటే మీ భార్య వయస్సు 65 సంవత్సరాల వరకు డబ్బులు జమచేసుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.