ఐదు పదుల వయసులో కూడా సెలబ్రిటీలు చెక్కు చెదరని అందంతో.. చెక్కిన పాలరాతి శిల్పంలా మెరిసిపోతూ.. యువతులకు ధీటుగా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. మరి వీరిని ఇంత అందంగా చూపించేది ఎవరు అంటే మేకప్ ఆర్టిస్ట్‌లు. తాజాగా నీతా అంబానీ మేకప్ ఆర్టిస్ట్ జీతం గురించి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ భార్య.. నీతా అంబానీ గురంచి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భర్తతో పాటు పలు వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తూ.. 24 గంటలు బిజీబిజీగా గడుపుతుంటారు. ఇప్పటికే మెన్స్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీం బాధ్యతలు చూస్తుండగా.. తాజాగా ఉమెన్స్ టీం బాధ్యతలు కూడా చేపట్టారు. ఇదే కాక రిలయన్స్ ఇండస్ట్రీ నేతృత్వంలో నడిచే పలు సామాజిక కార్యక్రమాల నిర్వహణ కూడా ఆమె చూసుకుంటారు. నిత్యం ఊపిరి సలపని పనులతో బిజీగా ఉన్నప్పటికి.. తన గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు నీతా అంబానీ. ప్రస్తుతం ఆమె వయసు 59 సంవత్సరాలు. ముగ్గురు పిల్లలు, వారికి పెళ్లిల్లు అయ్యి, పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే.. నీతా అంబానీ మాత్రం ఈ వయసులో కూడా చూపు తిప్పుకోనివ్వని అందంతో మెరిసిపోతున్నారు. అంతేకాక మోస్ట్ స్టైలీష్ బిజినెస్ ఉమన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నీతా అంబానీ.
ఎక్కడైనా వేడుకలకు, కార్యక్రమాలకు హాజరైతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు నీతా అంబానీ. ఫ్యామిలీ ఫంక్షన్స్, బిజినెస్ ఫంక్షన్స్ ఇలా వేడుక ఏదైనా సరే.. చక్కగా అందంగా రెడీ అవుతారు. మనువళ్లను ఎత్తుకునే వయసులో కూడా నీతా అంబానీ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. 60 ఏళ్లకు దగ్గరపడుతున్న ఈ వయసులో కూడా నీతా అంబానీ ఇంత అందంగా మెరిసిపోవడానికి ప్రధాన కారణం ఎవరో తెలుసా.. మిక్కీ కాంట్రాక్టర్. ఈయన ఎవరు అనుకుంటున్నారా.. నీతా అంబానీ సహా ఆమె కుమార్తె, కోడళ్లతో పాటు.. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలందరికి ఈయనే మేకప్ ఆర్టిస్ట్.
ఇక మిక్కీ కాంట్రాక్టర్ బాలీవుడ్‌లో టాప్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. బాలీవుడ్ ప్రముఖ తారలు కరీనా కపూర్, దీపికా పదుకొణె, ఐశ్వర్యా రాయ్, అనుష్క శర్మ, శిల్పా శెట్టి, సోనాలి బింద్రె సహా ఇంకా ఎందరినో అందంగా తీర్చి దిద్దిన మేకప్ ఆర్టిస్ట్‌గా మిక్కీ కాంట్రాక్టర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంబానీ కుటుంబంలోని మహిళలందరికి ఆయనే మేకప్ ఆర్టిస్ట్. ఈయన క్లైంట్స్ అందరూ సెలబ్రిటీలే కదా.. మరి ఆయన జీతం ఎంత ఉంటుంది అనుకుంటున్నారా. మిక్కి రోజు సంపాదన తెలిస్తేనే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు. ప్రస్తుతం మిక్కి జీతం గురించి నెట్టింట వైరల్ అవుతోంది.
సామాన్యులు, మధ్య తరగతి వారు మిక్కీ కాంట్రాక్టర్ సేవలు పొందలేరు. ముంబైలో ఆయన దగ్గర మేకప్ చేయించుకోవాలంటే రోజుకు ఒక్క వ్యక్తికి రూ.75 వేల నుంచి లక్ష ఆపైన వసూలు చేస్తాడు. టాప్ సెలబ్రిటీలు అయితే ఈ ధర మరి కాస్త ఎక్కువే ఉంటుంది. రోజుకు లక్షల్లో సంపాదించే మిక్కీ నెల జీతం.. టాప్ కంపెనీల సీఈవోలకు మించి ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ముంబైలో టాప్ మేకప్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న మిక్కీ.. ఒకప్పుడు టోక్యో బ్యూటీ పార్లర్‌లో హెయిర్‌డ్రెస్సర్‌గా పనిచేసేవాడు. సరైన పని, వేతనం దొరక్క ఇబ్బంది పడుతున్న రోజుల్లో.. నటి హెలెన్ మిక్కీని సినిమాల్లో పనిచేయమని ఆహ్వానించారట.
ఆ తర్వాత ఆయన దశ తిరిగింది. ఇక తన కెరీర్‌లో మిక్కీ చాలా సినిమాలకు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. హమ్ ఆప్కే హైన్ కౌన్, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కబీ ఖుషీ కబీ ఘమ్, కల్ హో నా హో, మొహబ్బతీన్, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, డాన్, వీర్ ది వెడ్డింగ్, గుడ్ న్యూస్, ఇంగ్లీష్ మీడియం వంటి సినిమాలకు మిక్కీ మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేశారు. నచ్చిన రంగంలో మనసు పెట్టి పని చేస్తే.. జీవితంలో ఉన్నతంగా ఎదగవచ్చు అన్న దానికి మిక్కీ ఉదాహరణగా నిలిచారు. మరీ దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.