ప్రపంచ కుబేరుల్లో ఒకడైన అంబానీ జీవితం ఎంత లగ్జరీగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన దగ్గర కోట్లు విలువు చేసే కార్లు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో..
‘కో అంటే కోటి.. దొర్లుకుంటు వస్తుంది కొండమీది కోతి’ అని క్షణం క్షణం సినిమాలో ఓ పాట ఉంటుంది. డబ్బుంటే ఏదైనా సాధ్యమే అన్న ఉద్ధేశ్యంతో రచయిత రాసిన ఆ మాటలు అక్షర సత్యం. బాగా డబ్బున్న వారు తమ హోదాకు తగ్గట్టు జీవితాన్ని లగ్జరీగా గడుపుతుంటారు. అన్నింటిని తమ కాళ్ల దగ్గర తెచ్చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ ఎలాంటి జీవితాన్ని గడుపుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసే కొన్ని పనులు ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలుగా నిలుస్తూ ఉంటాయి. ఇళ్లు, కార్లు, వస్తువులు ఇలా అన్నిటి విషయంలో కోట్లతో పాటు లగ్జరీ కామన్‌గా ఉంటుంది. తాజాగా, ఆయన ఓ రోల్స్ రాయిస్ కారు కొన్నారు.
ఆ కారు ధర 13 కోట్ల రూపాయలకు పైమాటేనట. 13 కోట్లే కదా.. అందులో విశేషం ఏముంది అని మీరు అనుకోవచ్చు. అక్కడే అసలు విషయం ఉంది. ఆ కారుకు పెయింటింగ్ వేయించటానికి ఆయన ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారంట. సుస్కాన్ సన్ కలర్ షేడ్ రంగు వేయించటానికి ఈ మొత్తం ఖర్చు అయిందట. దేశంలో ఉన్నా మిగిలిన కార్లకంటే తన కారు ప్రత్యేకంగా ఉండాలని అంబానీ ఈ కలర్‌ను వేయించుకున్నారట.
కారు పెయింటింగ్ కోసమే కాదు.. కారు నెంబర్ ప్లేటు కోసం కూడా భారీగానే ఖర్చు చేశారంట. సాధారణంగా వీఐపీ నెంబర్ కోసం 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ, ఆయన తనకు కావాల్సిన నెంబర్ కోసం ఏకంగా 12 లక్షల రూపాయలు ఖర్చు చేశారంట. తనకు ఎంతో ఇష్టమైన ‘‘0001’’ నెంబర్ తీసుకున్నారంట. ఇలా ఆయన చేసే ప్రతీ పని మీడియాను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. కాగా, ఈ కారు పెయింటింగ్, రిజిస్ట్రేషన్లు 2022లోనే పూర్తయ్యాయి. అప్పట్లో ఈ వార్త చాలా వైరల్‌గా మారింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి, ముఖేష్ అంబానీ తన కారు పెయింటింగ్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.