భారతీయ ప్రభుత్వం రంగానికి సంబంధించిన వాటిలో తపాల వ్యవస్థ ఒకటి. ఒకప్పుడు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ..తన సేవలు అందించేది. కాలక్రమేణ వచ్చిన మార్పులతో పోస్టాఫీస్ వ్యవస్థ కూడా అనే మార్పులు జరిగింది. కేవలం ఉత్తరాలు చేరవేయడమే కాకుండా అనేక పథకాలను ప్రజల ముందుకు తీసుకొవచ్చింది. పెట్టుబడి అందించే పథకాల్లో పోస్టాఫీస్ పథకాలు ముందుంటాయి. బ్యాంకుల ధీటుగా పోస్టాఫీసు తన సేవలను అందిస్తూ ప్రజలకు చేరువ అవుతోంది. ప్రస్తుతం పోస్టాఫీసుల్లో మంచి లాభాలు ఇచ్చే పథకాలు చాలానే ఉన్నాయి. అయితే చాలా మందికి ఏ ఏ పథకాలు పోస్టాఫీసులో ఉన్నాయి, వేటితో ఎంత లాభాలు ఉన్నాయో తెలియదు. పోస్టాఫీసులో ఉన్న పథకాల్లో ఓ స్కీమ్ అందరిని ఆకర్షిస్తోంది. అదే ‘గ్రామ సురక్ష పథకం’. తక్కువ రిస్క్ అందించే స్కీమ్స్ లో ఇది ఒకటి. ఇందులో నెల రూ.1500 పెడితే.. మెచ్యూరీటిపై రూ.31 నుంచి 35 లక్షల వరకు పొందుతారు. మరి.. ఈ పథకం పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
‘గ్రామ సురక్ష పథకం’ కింద 19 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్నవారు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకం కింద కనిష్టంగా పెట్టుబడి ఏడాదికి 10 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. అంటే నెల దాదాపు వెయ్యి రూపాయలు. ఈ స్కీమ్ కి గరిష్ఠం బీమ మొత్తం రూ10 లక్షల రూపాయలు ఉంటుంది. ఇక ప్రీమియం చెల్లింపుల విషయానికి వస్తే.. వినియోగదారుడు ఎంచుకునే దానిపై ఆధారపడి ఉంటుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు. ఈ ప్రీమియంలు చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ పథకం ద్వారా ఎవరైన రుణం కూడా తీసుకొవచ్చు. ఇందులో పెటుబడులు ప్రారంభించిన మూడేళ్ల తరువాత మీరు దాన్ని రీడిమ్ చేసుకోవచ్చు. కానీ కాలపరిమితి ముందే పథకాన్ని రద్దు చేస్తే, మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక ఇందులో లాభం ఎలా ఉంటుందో ఓ చిన్న ఉదాహరణ ద్వార తెలుసుకుందాం.
19 సంవత్సరాల వయస్సున ఓ వ్యక్తి ఈ పథకంలో పెట్టుబడి పెట్టాడని అనుకుంటే. మెచ్యూరిటీ 55 ,58 , 60 వరకు ఉంటుంది. అంటే అతడు పెట్టుబడి పెట్టేటప్పుడే మెచ్యూరిటీని నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ అతను 55 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే నెలవారీ ప్రీమియం రూ.1515 అవుతుంది. ఒక వేళ 58 సంవత్సరాల వరకు పెట్టుకుంటే నెల ప్రీమియం రూ.1463 అవుతుంది. అదే 60 ఏళ్ల పాటు పాలసీని కొనుగోలు చేస్తే ప్రీమియం రూ.1411 అవుతుంది. ఇదే వరుసల వారు పొందే లాభాలు చేస్తే.. 55 ఏళ్ల పాలసీకి రూ.31.60 లక్షలు, 58 ఏళ్ల పాలసికి రూ.33.40 లక్షలు , 60 ఏళ్ల పాలసికీ రూ.34.60 లక్షలు ప్రయోజనం పొందుతారు. అంటే దాదాపు 35 లక్షలు ఈ పాలసీ ద్వారా ప్రయోజనం పొందుతారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీ వయస్సు పెరిగితే ప్రీమియం చెల్లింపు కూడా పెరుగుతుంది.