SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Inspiring And Heart Breaking Story Behind The Washing Powder Nirma Girl

‘నిర్మా’వాషింగ్ పౌడర్ యాడ్ గుర్తుందా.. ఆ పాప వెనుక పెను విషాదం..!

  • Written By: Dharani
  • Published Date - Sat - 14 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘నిర్మా’వాషింగ్ పౌడర్ యాడ్ గుర్తుందా.. ఆ పాప వెనుక పెను విషాదం..!

ప్రస్తుత కాలంలో టీవీలో వచ్చే యాడ్స్‌ ఎక్కువ కాలం గుర్తుండవు. జింగిల్స్‌ చాలా వరకు తగ్గిపోయాయి. అసలు జింగిల్స్‌ అంటే ఈకాలం పిల్లలకు పెద్దగా తెలియదు కూడా. జింగిల్ అంటే ప్రకటనలు, ఇతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే చిన్న పాట లేదా ట్యూన్. ప్రస్తుత కాలంలో.. యాడ్‌ అంటే స్టార్‌ హీరోలే గుర్తుకు వస్తారు. కానీ 1990 కాలంలో యాడ్స్‌ అంటే మోడల్స్‌, చిన్నాచితకా నటీనటులు చేసేవారు. ఇక 1990లలో దేశం మొత్తాన్ని ఊర్రూతలూగించిన యాడ్‌.. నిర్మా వాషింగ్‌ పౌడర్‌ ప్రకటన. ఆ కాలం పిల్లలు అంతా ఈ జింగిల్‌ వింటూ పెరిగిన వాళ్లే. వాషింగ్‌ పౌడర్‌ నిర్మా.. పాలలోని తెలుపు.. నిర్మాతో వచ్చింది.. రంగుల బట్టలు తళతళగా మెరిసాయి.. నిర్మా అంటూ టీవీలో వచ్చే ఈ యాడ్‌.. అప్పట్లో ఓ రేంజ్‌లో వైరలయ్యింది. చిన్నారులు మొదలు వృద్ధుల వరకు అందరి నోట ఈ జింగిల్‌ వినిపించేది.

ఈ జింగిల్‌ ప్రకటన తర్వాత.. నిర్మా డిజర్జెంట్‌ విక్రయాలు కూడా బాగా పెరిగాయట. అయితే నిర్మా వాషింగ్‌ పౌడర్‌ యాడ్‌తో పాటు.. ప్యాకెట్‌ మీద ఉండే ఓ పాప ఫోటో కూడా అందరిని ఆకట్టుకునేది. వైట్‌ డ్రెస్‌లో.. రౌండ్‌గా తిరుగుతున్నట్లు కనిపించేది పాప. అయితే ఈ పాప ఎవరైన చిన్నారి మోడలా.. యాడ్‌ ఇంత పాపులర్‌ అయ్యింది కదా.. ఆ తర్వాత పాప ఏం చేసింది.. మళ్లీ ఏదైనా సీరియల్స్‌, సినిమాల్లో నటించిందా అనే అనుమానాలు సహజం. కానీ అవేం జరగలేదు. ఎందుకంటే.. నిర్మా వాషింగ్‌ పౌడర్‌ మీద ఉన్న ఆ చిన్నారి.. అప్పటికే మృతి చెందింది. పైగా తను నిర్మా వాషింగ్‌ పౌడర్‌ కంపెనీని స్థాపించిన యజమాని కుమార్తె కావడం గమనార్హం. ఈ యాడ్‌ని కుమార్తె జ్ఞాపకార్థం ఆమె తండ్రి రూపొందించాడు.

inspiring-and-heart-breaking-story-behind-the-washing-powder-nirma-girl

అయితే ప్యాకెట్‌ మీద చిరునవ్వులు చిందిస్తూ ఉండే ఆ చిన్నారి వెనక ఎంతో విషాదం దాగి ఉంది. ఇక ఈ నిర్మా వాషింగ్‌ పౌడర్‌ సంస్థను స్థాపించిన వ్యక్తి కర్సన్‌భాయ్‌ పటేల్‌. వీరిది గుజరాత్‌. కెమికల్‌ ఇంజనీర్‌ చేసిన కర్సన్‌భాయ్‌.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. రకరకాల ప్రయోగాలు చేసేవాడు. ఆ క్రమంలోనే 1969లో సోడా యాష్‌కి మరికొన్ని కెమికల్స్‌ కలిపితే మాసిన బట్టలను తళతళ మెరిసేలా చేయగలిగే పౌడర్‌ ఆయన ఆలోచనల నుంచి రూపుదిద్దుకుంది. ఇంటి వెనుకాల షెడ్డులోనే డిటర్జెంట్‌ పౌడర్‌ తయారీ చేపట్టారు కర్సన్‌భాయ్‌. ప్రయోగాలు, ఉద్యోగం.. ఇలా బిజీ బిజీగా గడిపేవాడు. ఊపిరిసలపని పనుల్లో​.. ఏమాత్రం సమయం దొరికినా.. ఆయన గారాల పట్టి.. నిరుపమతో ఆటపాటల్లో మునిగిపోయేవాడు. కుమార్తెని నిర్మా అంటూ ముద్దుగా పిలుచుకునేవాడు. ఇక కుమార్తెతో కలిసి రకరకాల ఆటలు ఆడేవాడు. పని, బిడ్డతో సంతోషంగా గడపడం.. ఇదే అతని లోకం అయ్యింది.

కారు ప్రమాదంతో పెను విషాదం..

అయితే సంతోషంగా సాగుతున్న వారిని చూసి.. విధికి కన్ను కుట్టింది. కారు యాక్సిడెంట్‌ రూపంలో.. విషాదం వారి ఇంటి తలుపు తట్టింది. ఈ ప్రమాదంలో.. నిర్మా కన్నుమూసింది. దాంతో వారి కుటుంబంలో అంధకారం అలుముకుంది. ఇక కర్సన్ భాయ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. కుమార్తె మరణం ఆయనను మానసికంగా కుంగదీసింది. బిడ్డతో పాటే ఆయన సంతోషం కూడా వెళ్లిపోయింది. దేనిమీదా ఆసక్తి లేదు.. తినడం, పడుకోవడం అన్ని మర్చిపోయాడు. జీవితం శూన్యం అయిపోయినట్లు భావించాడు. కుటుంబ సభ్యులు అతడి పరిస్థితి చూసి భయపడ్డారు. ఎలాగైనా మార్పు తీసుకురావాలని భావించారు. మళ్లీ ప్రయోగాలు చేసే దిశగా.. కర్సన్‌ను ప్రొత్సాహించారు. కాలం గడుస్తున్న కొద్ది.. కర్సన్‌ క్రమంగా బాధ నుంచి తేరుకోగలిగాడు. అయితే బిడ్డను మర్చిపోలేక.. తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఏమైనా చేయాలని భావించాడు. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే.. నిర్మా వాషింగ్‌ పౌడర్‌ కంపెనీ. 1969లో దీన్ని స్థాపించాడు కర్సన్‌.

ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారంపై దృష్టి..

బిడ్డ పేరుతో తయారు చేసిన వాషింగ్‌ పౌడర్‌ను నిర్మాను ఎలాగైనా ప్రజలందరికి చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు కర్సన్‌. దానిలో భాగంగా సైకిల్‌ మీద ఊరువాడా… మారు మూల వీధుల్లోకి కూడా తిరిగి.. గడపగడపకూ నిర్మా వాషింగ్‌ పౌడర్‌ను పరిచయం చేశాడు. ప్రారంభంలో నిర్మా డిటర్జెంట్‌ పౌడర్‌ను కేజీ రూ.3 లకే (అప్పటి ధర) అమ్మాడు. ధర తక్కువగా ఉండటమే కాక.. నాణ్యంగా ఉండటంతో.. మహిళలంతా నిర్మా వాషింగ్‌ పౌడర్‌నే కొనడం ప్రారంభించారు. దాంతో గుజరాత్‌లో కొనుగోళ్లు విపరీతం పెరిగాయి.

inspiring-and-heart-breaking-story-behind-the-washing-powder-nirma-girl

తన వాషింగ్‌ పౌడర్‌ను దేశమంతా పరిచయం చేయాలనుకున్నాడు కర్సన్‌. అందుకోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. అతడి దృష్టి టీవీ మీద పడింది. 80వ దశాబ్దంలో దూరదర్శన్‌ ప్రసారాలు దేశమంతటా విస్తరించటంతో.. తన వాషింగ్‌ పౌడర్‌ మార్కెట్‌ కోసం దాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు కర్సన్‌భాయ్‌. ఈ క్రమంలో నిర్మా వాషింగ్‌ పౌడర్‌ కోసం ప్రత్యేకంగా యాడ్‌ రూపొందించారు. ‘‘వాషింగ్‌ పౌడర్‌ నిర్మా.. వాషింగ్‌ పౌడర్‌ నిర్మా’’ అనే జింగిల్‌.. దేశమంతా మారుమోగింది. యాడ్‌లోని‘‘పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది’ అనే స్లోగన్‌ మహిళలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ జింగల్‌ ఎఫెక్ట్‌తో నిర్మా వాషింగ్‌ పౌడర్‌.. దేశంలోనే నంబర్‌ వన్‌ బ్రాండ్‌గా మారిపోయింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు బడ్జెట్‌లో లభిస్తుండటంతో.. నిర్మా అమ్మకాలు బాగా పెరిగాయి.

కూతురు రూపం చిరస్థాయిగా నిలిచిపోయేలా యాడ్‌..

నిర్మా యాడ్‌ ఆ స్థాయిలో సక్సెస్‌ కావడానికి కారణం.. కర్సన్‌భాయ్‌కు కూతురిపై ఉన్న ప్రేమ. అప్పటికే నిర్మా పేరుతో జనం మధ్యన కనిపిస్తున్న తన కూతురు రూపం చిరస్థాయిగా నిలిచిపోయేలా యాడ్‌ను డిజైన్‌ చేయించాడు కర్సన్‌ భాయ్‌. ఇక జింగిల్‌ చివర్లో.. ముందుగా తెల్ల గౌనులో ఓ చిన్నారిపాపను గుండ్రంగా తిప్పించి.. ఆ స్టిల్‌ ఫ్రీజ్‌ చేసే సమయంలో తన కూతురు ఫొటో వచ్చేలా డిజైన్‌ చేశాడు. ఈ ప్రయోగం సక్సెస్‌ అయ్యింది. అలా తన కూతురు రూపుని.. నిర్మా వాషింగ్‌ పౌడర్‌ ప్యాకెట్‌ మీద ముద్రించాడు కర్సన్‌. ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకూ కూడా ఎన్ని బ్రాండెడ్ వాషింగ్ పౌడర్లు ఉన్నా.. నిర్మా అలానే కొనసాగుతోంది. ఇక అప్పట్లో పేరు తెలియని వారు.. తెల్లగౌను వేసుకున్న పాప బొమ్మ ఉన్న డిటెర్జెంట్‌ పౌడర్‌ అడిగి మరీ కొనుక్కునేలా ఆ యాడ్‌ క్లిక్‌ అయ్యింది.

inspiring-and-heart-breaking-story-behind-the-washing-powder-nirma-girl

అంచెలంచెలుగా ఎదుగుతూ.. అలా 2004 నాటికల్లా దేశంలో నంబర్‌ వన్‌ బ్రాండ్‌గా కొనసాగుతూ 8 లక్షల టన్నుల డిటర్జెంట్‌ పౌడర్‌ తయారు చేస్తున్న సంస్థగా నిర్మా రికార్డు సృష్టించింది. నిర్మా కంపెనీ ప్రత్యక్షంగా 14 వేల మందికి ఉపాధి కల్పిస్తూ.. పరోక్షంగా లక్ష మందికి పైగా జీవనాధారమయ్యింది. అలా కుమార్తె మీద ప్రేమతో ఓ తండ్రి చేసిన ప్రయోగం ఎందరికో జీవితాన్నిచ్చింది. వారి నవ్వులో.. తన కుమార్తె ముఖాన్నిచూసుకుంటున్నారు కర్సన్‌ భాయ్‌.

Tags :

  • business news
  • gujarat
  • inspire story
  • Nirma Washing Powder
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam