పన్నుల ఎగవేత, స్విస్ బ్యాంకు ఖాతాలలో ఉన్న నిధుల వివరాలు వెల్లడించకపోవడం వంటి ఆరోపణలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ సోదరుడు రిలయన్స్ గ్రూప్(అడాగ్) ఛైర్మన్ అనిల్ అంబానీని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయ పన్నుశాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. స్విస్ బ్యాంకులోని రెండు ఖాతాల్లో రహస్యంగా దాచిన రూ.814 కోట్ల నిధులపైనా, రూ.420 కోట్లు పన్నులను ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేశారని ఆదాయపు పన్ను శాఖ ఆరోపిచింది.
అనిల్ అంబానీ ఉద్దేశ పూర్వకంగానే విదేశీ బ్యాంకు అకౌంట్ వివరాలను వెల్లడించలేదని ఆరోపించింది. దీనికి సంబంధించి ఆగస్టు మొదటి వారంలో నే ఐటీ శాఖా అనిల్ అంబానీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2012-13 నుంచి 2019-20 అసెస్ మెంట్ సంవత్సరాల మధ్యకాలానికి సంబంధించి విదేశాల్లోని ఆస్తులను వెల్లడించకపోవడం ద్వారా అనిల్ అంబానీ టాక్స్ ఎగవేశారని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఆగష్టు 31లోగా తనపై వచ్చిన అభియోగాలపై సమాధానమివ్వాలని ఐటీ శాఖ సూచించింది. మండ్ ట్రస్ట్, నార్తర్న్ అట్లాంటిక్ ట్రేడింగ్ అన్‌లిమిటెడ్ (ఎన్‌ఏటీయూ) అనే రెండు విదేశీ సంస్థల కూపీ లాగితే వాటి అంతిమ లబ్ధిదారు అనిల్ అంబానీయేనని తేలినట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి.
పన్నుల చట్టం-2015 చట్టంలోని సెక్షన్ 50,51 కింద అనిల అంబానీ ప్రాసిక్యూట్ చేయబడ్డాడని సంబంధింత శాఖా పేర్కొంది. ఒక వేళ అనిల్ అంబానీపై వచ్చిన ఆరోపణలు రుజువైతే గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష మరియు జరిమానాత కూడిన శిక్షపడే అవకాశం ఉంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.