మొబైల్ డేటా వినియోగంలో జియో ప్రభంజనమే సృష్టించింది. అనతికాలంలోనే అతిపెద్ద నెట్ వర్క్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జియో కస్టమర్లు ఆ సంస్థపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం గతంలో ఉన్న టారిఫ్ లను సవరిస్తూ డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. దాంతో అన్ని టారిఫ్ లు భారీగా పెరిగిపోయాయి. ఒకింత వ్యతిరేకత కూడా వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇప్పుడు వినియోగదారులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఒక ప్లాన్ ధరను తగ్గిస్తూ జియో నిర్ణయం తీసుకుంది.
టారిఫ్ తగ్గించడమే కాదు.. ఆ ప్లాన్ తీసుకున్న వారికి ఏడాదిపాటు డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీ అంటూ పేర్కొంది. ప్లాన్ వివరాలు: రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 మెసేజ్ లు, 2 జీబీ పూర్తయ్యాక 64KBPS స్పీడుతో బ్రౌజింగ్, 28 రోజుల కాలపరిమితితో అందుబాటులో ఉంది. డిసెంబరు నెలలో ఈ ప్లాన్ ను సవరిస్తూ రూ.601కి పెంచింది. మళ్లీ తాజాగా రూ.499కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జియో ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.