కస్టమర్ల సంఖ్య పెరిగేలా వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి బడా టెలికాం కంపెనీలు. ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్లుగా ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాయి. ఎయిర్ టెల్, జియో పోటాపోటీగా ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా జియో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.
మొబైల్ డేటా వినియోగంలో జియో ప్రభంజనమే సృష్టించింది. అనతికాలంలోనే అతిపెద్ద నెట్ వర్క్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జియో కస్టమర్లు ఆ సంస్థపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం గతంలో ఉన్న టారిఫ్ లను సవరిస్తూ డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. దాంతో అన్ని టారిఫ్ లు భారీగా పెరిగిపోయాయి. ఒకింత వ్యతిరేకత కూడా వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇప్పుడు వినియోగదారులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా […]
ప్రముఖ సంచలన టెలీకాం సంస్థ జియో కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఇటీవలే ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు పెంచి షాక్ ఇచ్చిందో లేదో అప్పుడే మూడు ప్లాన్‌ల రీచార్డ్ లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ను ముందుకు తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అంటే 28 నుంచి 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్యాక్స్ పై క్యాష్‌బ్యాక్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. అదేలగో ఇప్పుడు తెలుసుకుందాం. రూ.299, రూ.666, రూ.719 ప్లాన్‌లతో రీచార్జ్ చేసుకుంటే 20 శాతం క్యాష్‌బ్యాక్ మూడు […]