కస్టమర్ల సంఖ్య పెరిగేలా వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి బడా టెలికాం కంపెనీలు. ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్లుగా ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాయి. ఎయిర్ టెల్, జియో పోటాపోటీగా ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా జియో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.
కస్టమర్లను ఆకట్టుకునేందుకు బడా టెలికాం కంపెనీలు మంచి ఆఫర్లతో కూడిన ఫ్లాన్స్ తీసుకు వస్తున్నాయి. ముఖ్యంగా జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియా కంపెనీలు.. పోటీతో కూడిన ప్లాన్స్ రూపొందిస్తున్నాయి. కస్టమర్ల సంఖ్య మరింత పెరిగేలా వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్లుగా ఈ ప్లాన్స్ ఉంటున్నాయి. అయితే ప్రతి కంపెనీకి పోస్టు పెయిడ్ కస్టమర్ల కన్నా ప్రీ పెయిడ్ కస్టమర్లు చాలా తక్కువగా ఉంటున్నారు. ఇప్పుడు వీరి సంఖ్యను బలోపేతం చేసుకునేందుకు బడా కంపెనీలు భారీ ప్లాన్స్‌తో ముందుకు వస్తున్నాయి.
ప్రీపెయిడ్ కస్టమర్లపై దృష్టి సారించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చెందిన జియో.. కొద్దిరోజుల కిందట రూ.599, రూ.799 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ తీసుకు రాగా.. దానికి పోటీగా ఎయిర్‌టెల్ కూడా ఇలాంటివే తీసుకొచ్చింది. పరిమిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ వంటి ఆఫర్స్‌తో పాటు .. ఒకే సిమ్‌పై ఎక్కువ కనెక్షన్లకు ప్రయోజనాలు అందిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభమైన వేళ జియో మరో గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చింది. అన్‌లిమిటెడ్ డేటాతో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. పోస్టు పెయిడ్ కస్టమర్ల కోసం రూ. 599 ప్లాన్ తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా అపరిమిత డేటా, వాయిస్ కాల్ బెనిఫిట్స్‌తో పాటు రోజుకు వంద మేసేజ్‌లు పొందొచ్చు. ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో మ్యూజిక్ వంటి మరెన్నో జియో యాప్స్ సేవలను కూడా ఉచితంగా పొందొచ్చు.
జియో వెల్‌కం ఆఫర్ కింద 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన వారు ఫ్రీ 5జీ అన్‌లిమిటెడ్ డేటా కూడా అందుకుంటారు. ఈ లెక్కన రోజుకు రూ.19 చెల్లించాల్సి వస్తుంది. అంటే 19 రూపాయలకే రోజువారీగా అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్, ఎస్ఎమ్ఎస్‌లు పొందొచ్చు. అయితే ప్రీ పెయిడ్ యూజర్లు కూడా ఈ అవకాశాన్ని పొందవచ్చు. ఎలా అనుకుంటున్నారా.. ప్రీపెయిడ్ యూజర్స్ పోస్టు పెయిడ్‌కు మారిపోతే ఈ సేవలను పొందవచ్చు. ఇంకా జియో ప్రీమియం సర్వీసుల్ని పొందాలనుకునే కొత్త కస్టమర్లు.. ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు మారిన వారికి కూడా.. ఈ రూ.599 ప్లాన్‌లో చేరేందుకు 30 రోజుల ఫ్రీ ట్రయల్ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా జియో.. ఇతర ఐపీఎల్ ప్లాన్స్‌ను కూడా ప్రవేశపెట్టింది
ఇందులో రూ.219, రూ.399, రూ.999 వంటి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ క్రికెట్ ప్లాన్స్‌తో జియో ప్రీపెయిడ్ యూజర్లు రోజువారీగా 3జీబీ వరకు డేటా పొందుతారు. రూ.219 ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3జీబీ డేటా పొందొచ్చు. అదనంగా మరో 2జీబీ కూడా పొందుతారు. ఈ లెక్కన మొత్తం 14 రోజులకు 44 జీబీ డేటా ఇస్తోంది. అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 100 మేసేజ్‌లు చేసుకునే సదుపాయం ఉంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు ఇక పూర్తిగా ఉచితం. రూ. 399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడీతో రోజుకు 3 జీబీ చొప్పున 90 జీబీ పొందే అవకాశం కల్పిస్తుంది. 90జీబీ.. రోజుకు 3GB చొప్పున 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రూ.999 ప్లాన్ అయితే మొత్తం 292 జీబీ డేటా రోజుకు 3జీబీ డేటాతో వస్తుంది. దీని వ్యాలిడిటీ 84 రోజులు ఉంది. వీటికి కూడా కామన్ సేవలైన అపరిమిత కాల్స్, వంద ఎస్ఎమ్ఎస్‌లు పూర్తిగా ఉచితం.