సెల్ ఫోన్ కొనడం కంటే.. వాటికి రీఛార్జ్ చేయించడానికే ప్రజలు తెగ ఆలోచిస్తున్నారు. ఏ ప్లాన్ తీసుకోవాలి? ఎంత ప్లాన్ తీసుకోవాలి? అనే ప్రశ్నలు వస్తన్నాయి. పైగా ప్లాన్ డీటెయిల్స్ చూస్తే 28 డేస్, 22 డేస్ వ్యాలిడిటీ అని చెబుతుంటారు. అయితే వీఐ కంపెనీ మాత్రం వారి కస్టమర్లకు శుభవార్త చెప్పింది. 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 3 టారిఫ్ ప్లాన్స్ తీసుకొచ్చింది.
మొబైల్ డేటా వినియోగంలో జియో ప్రభంజనమే సృష్టించింది. అనతికాలంలోనే అతిపెద్ద నెట్ వర్క్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జియో కస్టమర్లు ఆ సంస్థపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం గతంలో ఉన్న టారిఫ్ లను సవరిస్తూ డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. దాంతో అన్ని టారిఫ్ లు భారీగా పెరిగిపోయాయి. ఒకింత వ్యతిరేకత కూడా వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇప్పుడు వినియోగదారులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా […]