అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ బాగా తగ్గాయి. శనివారం, ఆదివారం మార్కెట్ సెలవు దినాలు కావడంతో మార్కెట్ కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి. పైగా ఫెడరల్ రిజర్వ్ పెంచిన వడ్డీ రేట్ల కారణంగా బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పతనమవుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర రూ. 1842 డాలర్ల వద్ద ఒక డాలర్ కి అటూ, ఇటూ ఊగిసలాడుతుంది. వెండి ధర కూడా దాదాపు ఇలానే ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్సు స్పాట్ గోల్డ్ ధర రూ. 1842.08 డాలర్లు నుంచి 1841 డాలర్ల మధ్య నడుస్తోంది. సోమవారం ఉదయం 8.56కి ఔన్సు స్పాట్ గోల్డ్ ధర రూ. 1841.83 డాలర్లు వద్ద కొనసాగుతుంది. ఇక ఔన్సు వెండి ధర రూ. 21.73 డాలర్ల వద్ద కొనసాగుతుంది. బంగారం ధర 0.04 శాతం పడిపోగా.. వెండి ధర రూ. 0.09 శాతం మేర పడిపోయింది.
బంగారంతో పోలిస్తే వెండి ధర ఎక్కువగా పడిపోయింది. 0.14 శాతం మేర పడిపోయింది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,200 ఉండగా.. ఇవాళ కూడా అదే రేటు కొనసాగనుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950 ఉంది. నిన్న ఉన్న ధరే ఇవాళ కూడా ఉంది. అయితే మార్కెట్ ఓపెన్ అయ్యాక ఈ ధరల్లో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 18కి ముందు వరకూ తగ్గుతూ వచ్చిన ధరలు.. ఆరోజున 22 క్యారెట్ల బంగారం రూ. 400, 24 క్యారెట్ల బంగారం రూ. 440 పెరిగింది. ఆదివారం, సోమవారం మాత్రం అవే ధరలు ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 56,950 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,200 ఉంది. కిలో వెండి ధర ఆదివారం రూ. 71,800 ఉండగా ఇవాళ కూడా అదే ధర కొనసాగుతుంది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వెండి ధర స్వల్పంగా పడిపోయింది. యునైటెడ్ స్టేట్స్ లో సెలవు కావడంతో సోమవారం మార్కెట్ కార్యకలాపాలు తక్కువగా ఉండే అవకాశం ఉండవచ్చు. కాబట్టి బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే లైవ్ లో బంగారం, వెండి ధరలు నెగిటివ్ ప్రైజ్ లోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే లైవ్ లో బంగారం, వెండి ధరలు నెగిటివ్ ప్రైజ్ లోనే కొనసాగుతున్నాయి. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు అయితే బాగా తగ్గాయి. ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి మీరేం అనుకుంటున్నారు. బంగారం, వెండి ధరలు తగ్గుతాయని అనుకుంటున్నారా? పెరుగుతాయాని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏదైనా గానీ కామెంట్ చేయండి.