బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. శుభకార్యం ఏదైనా బంగారం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇన్ని రోజులూ తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోన్న క్రమంలో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల వద్ద రూ. 750 మేర పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,150 ఉంది. నిన్న ఇదే బంగారం ధర రూ. 51,400 ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 820 పెరిగింది. నిన్న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల వద్ద రూ. 56,070 వద్ద కొనసాగగా.. ఇవాళ రూ. 56,890 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,400 ఉంది. నిన్న ఇదే బంగారం ధర రూ. 51,900 ఉంది. నిన్నటి మీద ఇవాళ రూ. 500 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే రూ. 540 పెరిగింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,620 ఉండగా.. ఇవాళ 57,160 ఉంది.
ముంబై నగరంలో హైదరాబాద్ ధరలే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,040 ఉంది. ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. గడిచిన 5 రోజుల్లో వరుసగా నాలుగు సార్లు వెండి ధర తగ్గుతూ వచ్చింది. మార్చి 7న రూ. 600 తగ్గగా.. మార్చి 8న భారీగా రూ. 2500 తగ్గింది. మార్చి 9, 10 తేదీల్లో రూ. 200 తగ్గగా మొత్తం మీద రూ. 3300 తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,700 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కిలో వద్ద రూ. 450 పెరిగింది. ముంబైలో కూడా ఢిల్లీ ధరే ఉంది. ఇక చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ. 1400 పెరిగింది.
ప్రస్తుతం చెన్నైలో కిలో వెండి ధర రూ. 68,700 పలుకుతోంది. హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 68,700 వద్ద కొనసాగుతోంది. నిన్న కిలో వెండి ధర రూ. 67,300 ఉండగా ఇవాళ రూ. 1400 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర రూ. 20.53 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ గోల్డ్ ఔన్సు ధర రూ. 1867.3 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఇదే స్పాట్ గోల్డ్ అంతర్జాతీయ మార్కెట్లో 2 వేల డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే బంగారం, వెండి ధరలు మళ్ళీ పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. మరి బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.