బంగారం ధర.. గరిష్టాల నుంచి నెమ్మదిగా దిగి వస్తోంది. గత నాలుగు రోజులుగా.. పసిడి ధర ప్రతి రోజు పడిపోతుంది. నేడు కూడా బంగారం ధర దిగి వచ్చింది. తులం మీద భారీగా తగ్గింది. నేటి ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం ధర చూస్తే.. కొనాలో, వద్దో అర్థం కానీ పరిస్థితి. ప్రతి రోజు ధర పెరుగుతోంది. ఈ పెరుగుదల ఎంత భారీగా ఉండనుందో.. అసలు ఎన్నాళ్లు ఇలా పెరుగుతూ పోతుందో అర్థం కావడం లేదు. భవిష్యత్తులో ఏమైనా దిగి వస్తుందా లేదా.. ఇదే పరిస్థితి ఉంటే.. బంగారం కొనగలమా.. అంటూ సామాన్యులు శతవిధలా ఆలోచిస్తున్నారు. అసలే మే నెల ప్రారంభం నుంచి వివాహాలు మొదలవుతాయి. ఇటు చూస్తే బంగారం ధర చుక్కలను తాకుతుంది. ఏం చేయాలో అర్థం కాక.. కొనాలో వద్దో తెలియక సతమతమవుతున్నారు జనాలు. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర వరుసగా దిగి వస్తోంది. నాలుగు రోజుల నుంచి పసిడి ధర నేల చూపులు చూస్తోంది. దానిలో భాగంగానే నేడు కూడా బంగారం ధర దిగి వచ్చింది. మరి నేడు తులం మీద ఎంత ధర తగ్గింది.. హైదరాబాద్, ఢిల్లీలో బంగారం ధర ఎలా ఉంది అంటే..
నేడు హైదరాబాద్‌లో బంగారం ధర దిగి వచ్చింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ పసిడి ధర 10 గ్రాముల మీద ఏకంగా రూ.390 మేర తగ్గింది. ఇక నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్ బంగారం తులం ధరరూ.55,400 లకు దిగివచ్చింది. గత నాలుగు రోజులుగా చూసుకుంటే మొత్తంగా బంగారం ధర తులం మీద రూ.850 మేర పడిపోయింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర కూడా భారీగానే పడిపోయింది. 24 క్యారెట్ బంగారం ధర తులం మీద రూ.430 మేర దిగివచ్చి.. రూ.60,430 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ మేలిమి బంగారం ధర కూడా గత నాలుగు రోజుల్లో తులానికి రూ.930 మేర పడిపోయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ బంగారం ధర తులానికి రూ.390 తగ్గి ప్రస్తుతం రూ.55,550 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం ధర 10 గ్రాముల మీద రూ.430 తగ్గి.. ప్రస్తుతం రూ.60,580 వద్ద కొనసాగుతోంది.
ఒకవైపు పసిడి పరుగుకు బ్రేక్ పడగా.. వెండి ధర మాత్రం గరిష్ఠాల్లోనే కొనసాగుతోంది. నేడు అనగా మంగళవారం మాత్రం.. కాస్త దిగివచ్చి ఊరట కలిగించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.200 తగ్గి రూ.80 వేల మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.300 తగ్గింది. ప్రస్తుతం హస్తినలో కిలో వెండి ధర రూ. 76,300 వద్ద ఉంది. హైదరాబాద్‌లో వెండి రేటు కాస్త ఎక్కువ, బంగారం రేటు కాస్త తక్కువగా ఉంటుంది. అందుకు స్థానిక పన్నులు ప్రధాన కారణంగా ఉంటాయి. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం బంగారం ధర దిగి వచ్చింది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు ప్రస్తుతం 1994.65 కు దిగివచ్చింది. అలానే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.91 డాలర్ల మార్క్ వద్ద ఉంది.