మీరు ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా..? అందులోనూ తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే ఈ-స్కూటర్ కోసం వేచి చూస్తున్నారా..? అయితే, మీకో గుడ్ న్యూస్. అలాంటి ఈ-స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చేసింది. నొయిడా కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ జీమోపాయ్ సంస్థ అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్ సూపర్‌మాక్స్ ను తీసుకొచ్చింది. ఆసక్తి గలవారు రూ.2999తో ఫ్రీ బుకింగ్ చేసుకోవచ్చు.
ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరలో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ-స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చేసింది. నొయిడా కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ జీమోపాయ్ సంస్థ అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్ సూపర్‌మాక్స్ ను తీసుకొచ్చింది. దీని ధర రూ.79,999గా నిర్ణయించారు. ఇందులో 1.8 కిలోవాట్ల పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ను అందించారు. దీనిని ఒకసారి ఫుల్ చాఛార్జ్ చేస్తే 100 కి.మీ. వరకు ప్రయాణం చేయవచ్చు. ఇది గంటకు 60 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలదు.
ఇక ఫీచర్ల విషయానికొస్తే.. బ్యాటరీ రియల్‌టైం మానిటరింగ్, స్పీడ్ అలర్ట్స్, యాంటీ థెఫ్ట్ అలారం, లైవ్ ట్రాకింగ్, సర్వీస్ రిమైండర్స్ జారీ వంటి ఫీచర్లు జత చేశారు. దీనిని జిమోపాయి కనెక్ట్ యాప్‌తో స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేయొచ్చు. మొత్తం ఆరు కలర్లలో జాజీ నియాన్, ఎలక్ట్రిక్ బ్లూ, బ్లేజింగ్ రెడ్, స్పార్క్లింగ్ వైట్, గ్రాఫైట్ గ్రే, ఫ్లోరెసెంట్ ఎల్లో రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. ఆసక్తి గలవారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రూ.2,999 చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. మార్చి 10 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఈ-స్కూటర్లలో 100 కి.మీ. మైలేజ్ వచ్చేది కావాలంటే.. లక్షకు పైగా వెచ్చించాలి. ఇలాంటి సమయంలో ఇది తక్కువ ధరే అని చెప్పొచ్చు.
.#Gemopai (An Indian Company) launches Electric Scooter #Ryder SuperMax. Here are the key highlights:
— 3.62 BHP from BLDC Hub Motor
— 1.8 KWH Portable Battery
— 60 Km/Hr top speed
— 100 Km Range
— App connectivity
— Rs 79,999 (Introductory Price) pic.twitter.com/pBGui2Y9gp— Times Drive (@TNTimesDrive) March 1, 2023