మీకు అత్యవసరంగా డబ్బు అవసరముందా? లోన్ కోసం బ్యాంకుల వెంట పరుగులు పెడుతున్నారా..? క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందని బ్యాంకు సిబ్బంది లోన్ ఇవ్వట్లేరా..? అయినా పర్లేదు. మీరు సులభంగా లోన్ పొందవచ్చు. ఎలా అనుకుంటున్నారా? అది తెలియాలంటే కింద చదివేయాల్సిందే..
ఆర్థిక పరిస్థితిలో.. కుటుంబ అవసరాలో కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరమవుతుంది. ఆ సమయాల్లో వారు లోన్ కోసం బ్యాంకుల వెంట పరుగులు పెడుతుంటారు. కానీ, వారిలో కొందరికే లోన్లు మంజూరవుతుంటాయి. మరికొందరికి సిబిల్ స్కోర్ బాగా లేదనో లేదా తిరిగి చెల్లించగలిగే స్తొమత లేదనో బ్యాంకు సిబ్బంది అందుకు నిరాకరించవచ్చు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ పొందే వెసులుబాటు ఉంది.
బ్యాంకులు లేదా ఏ ఇతర ఆర్థిక సంస్థలైనా కస్టమర్లకు రుణాలు ఇవ్వాలంటే ముందుగా చూసేది.. క్రెడిట్ స్కోర్. ఎవరికైతే సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటుందో వారికి సులభంగా రుణాలు ఇస్తుంటాయి. ఈ క్రెడిట్ స్కోర్ అనేది సాధారణంగా 300 నుంచి 900 వరకు ఉంటుంది. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే.. లోన్ పొందటం చాలా సులభం. ఇక 550 నుంచి 750 మధ్య స్కోర్ ఉంటే పర్లేదు అని అర్థం. వీరికి రుణాలు మంజూరవుతాయి. అదే 550 కంటే తక్కువ స్కోర్ ఉంటే రుణాలు పొందటం చాలా కష్టం. అలాంటి సమయాల్లో కింద చెప్పిన మార్గాలను పాటిస్తే.. మీరు సులభంగా రుణం పొందవచ్చు.
సిబిల్ స్కోర్ తక్కువుగా ఉన్నప్పుడు ప్రభుత్వ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపవు. అలాంటి సమయాల్లో ప్రైవేటు బ్యాంకులు/ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు/ ఫిన్‌టెక్ సంస్థలను సంప్రదించండి. వీటిలో సిబిల్ స్కోర్ తక్కువుగా ఉన్నా రుణాలు పొందవచ్చు. అయితే వీటిలో వడ్డీ కాస్త ఎక్కువుగా ఉంటుంది. గమనించగలరు.
క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నప్పుడు గ్యారెంటర్ సహాయంతో లోన్ పొందవచ్చు. మిమ్మల్ని మనము వ్యక్తులు ఉన్నప్పుడు ఈ విధానంలో లోన్ పొందటం చాలా సులభం. బ్యాంక్ అతని క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తుంది. అన్నీ సక్రమంగా ఉంటే, అతని హామీ మీద మీకు రుణం మంజూరుచేస్తుంది. మీరు రుణం చెల్లించనియెడల అతడు ఆ రుణానికి బాధ్యుడు.
ఆస్తిని తనఖా పెట్టి కూడా లోన్ పొందవచ్చు. ఇది హామీదారు వంటిది. క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందని బ్యాంకు లోన్ ఇవ్వడానికి నిరాకరించినప్పుడు ఇదే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. ఇందులో గ్యారెంటర్ చేసే పని ఆస్తి చేస్తుంది. అయితే రుణం తిరిగి చెల్లించకపోతే బ్యాంకు తనఖా పెట్టిన ఆస్తిని విక్రయించే హక్కు ఉంటుందని మరవకండి.
Disclaimer: ఈ సమాచారం అవగాహన కొరకు మాత్రమే. పైన చెప్పబడిన విధానాలు పాటించాలా..? వద్దా..? అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఒకవేళ లోన్ తీసుకోవాలనుకున్నా.. ముందుగా ఆ రుణ చెల్లింపులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం మంచిది.