సొంతంగా చిన్న వ్యాపారం చేసుకోవాలనో, లేక వ్యక్తిగత ఖర్చుల కోసమనో లేక వేరే ఇతర ఖర్చుల కోసమనో కొంతమంది బయట అప్పు చేస్తుంటారు. పైగా బంగారమమో, ఇంటి కాగితాలో, ఆస్తి కాగితాలో ఏవో ఒకటి తాకట్టు పెట్టాలి. పైగా వడ్డీ ఎక్కువ. నెల నెలా ఈ అధిక వడ్డీ కట్టడం తప్ప అసలు మాత్రం అలానే ఉంటుంది. దీంతో వడ్డీ భారం, అప్పు భారం విపరీతంగా పడుతుంది. ఒక్కోసారి అసలు కంటే కట్టిన వడ్డీనే ఎక్కువ ఉంటుంది. […]
గతంలో పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. అయినా అధికారులు కనికరించేవారు కాదు. ఆ ఫామ్..ఈ ఫామ్ .. అంటూ నెలలు పొడుగునా తెప్పేవారు. ఒకవేళ, అన్నీ కరెక్ట్ గా ఉన్నా.. అదుంటది.. ఇదుంటది.. వెరిఫికేషన్ అంటూ.. నాలుగు నెలలైనా తిప్పేవారు. ఇదంతా ఒకప్పటి పరిస్థితి. ప్రస్తుతం బ్యాంకింగ్ సేవలు పూర్తిగా మారిపోయాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దాదాపు అన్ని బ్యాంకులు డిజిటల్ పద్దతిలోనే వ్యక్తిగత లోన్ లు మంజూరు చేస్తున్నాయి. […]