కార్ల తయారీ కంపెనీల్లో టాటా మోటార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేశీ వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకు టాప్ క్లాస్ కార్లను అందిస్తోందీ సంస్థ. భారత ఆటోమొబైల్ మార్కెట్ లో ఉన్న విపరీతమైన పోటీని తట్టుకోలేక కొన్నాళ్లు వెనుకపడిన టాటా మోటార్స్.. తిరిగి అంతే వేగంగా పుంజుకుని విక్రయాల్లో దూసుకెళ్తోంది. ప్రయాణికుల సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కార్లను రూపొందించడం టాటా ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఈ క్రమంలో సంస్థ తయారు చేసిన నెక్సాన్ కార్లు దేశీ విపణిలో ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. నెక్సాన్ ఈవీ కార్లు కూడా ఫీచర్ల పరంగా అదుర్స్ అనేలా ఉండటంతో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ధర విషయంలో మాత్రం కాస్త ఎక్కువనే చెప్పాలి.
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ మోడళ్ల ధరలు రూ.14.49 లక్షల నుంచి రూ.16.99 లక్షల రేంజ్ లో (ఎక్స్ షోరూం) ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరింత మంది వినియోగదారులకు ఈ కార్లను దగ్గర చేయాలనే ఉద్దేశంతో నెక్సాన్ ఈవీ ప్రైమ్, ఈవీ మ్యాక్స్ కార్ల ధరలను రూ.50 వేల వరకు తగ్గిస్తున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. ఈ ధరల సవరణతో నెక్సాన్ ఈవీ ప్రైమ్ పరికరాల విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండబోవని సంస్థ స్పష్టం చేసింది.
కాగా, భారతీయ మార్కెట్లోకి నెక్సాన్ ఈవీలోని కొత్త వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్ ఎమ్ ను టాటా మోటార్స్ కంపెనీ ఆవిష్కరించింది. దీని ధర రూ.16.49 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 453 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇందులో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్, ఆటో క్లైమాట్ కంట్రోల్, ఈఎస్‌పీ, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కీలెస్ గో, కనెక్టెడ్ వెహికిల్ టెక్, అన్ని టైర్లకు డిస్క్ బ్రేకులు లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉండటం విశేషం. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్ ఎమ్ డెలివరీలు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి మొదలవుతాయని సంస్థ వెల్లడించింది. మరి దేశం గర్వించతగ్గ కార్లను తయారు చేసే టాటా మోటార్స్.. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కార్లపై 50 వేల రూపాయల తగ్గింపును ప్రకటించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Tata Nexon EV prices have been cut – Range has been increased
Two days after the launch of Mahindra XUV400 Electric, Tata Motors has announced a massive update for Nexon EV
Base variant price cut by Rs 50k, top variant by Rs 85k, range increased to 453 km. pic.twitter.com/WPBhHvrgwr
— RushLane (@rushlane) January 18, 2023