చిన్న చిన్న ఉద్యోగాలు మీకు జీవితంపై భరోసా ఇవ్వలేదా! బిజినెస్ చేస్తూ జీవితంలో స్థిరపడాలన్నది మీ కోరికా! ఐతే మీ కోసమే మంచి బిజినెస్ ఐడియా తీసుకొచ్చాం.. చిన్న చిన్న పట్టణాలు, మెట్రో నగరాల్లో పాల వ్యాపారం చేస్తూ లక్షలు గడించవచ్చు. నగర శివారు పరిసరాల్లో పాలు సేకరించి వాటిని నగర వాసులకు అమ్మడం లేదా చిన్న డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకొని మీరే స్వయంగా పాల అమ్మకాలు సాగించవచ్చు.
చిన్న చిన్న ఉద్యోగాలు మీకు జీవితంపై భరోసా ఇవ్వలేదా! బిజినెస్ చేస్తూ జీవితంలో స్థిరపడాలన్నది మీ కోరికా! ఐతే మీ కోసమే మంచి బిజినెస్ ఐడియా తీసుకొచ్చాం.. చిన్న చిన్న పట్టణాలు, మెట్రో నగరాల్లో పాల వ్యాపారం చేస్తూ లక్షలు గడించవచ్చు. నగర శివారు పరిసరాల్లో పాలు సేకరించి వాటిని నగర వాసులకు అమ్మడం లేదా చిన్న డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకొని మీరే స్వయంగా పాల అమ్మకాలు సాగించవచ్చు. పాల వ్యాపారం ఎలా ఆరంభించాలి..? ప్రభుత్వ రాయితీలు..? ఎలాంటి ప్రదేశాల్లో డైరీ ఫామ్ ఏర్పాటు చేస్తే అధిక లాభాలుంటాయి. దేశంలో పాల వినియోగం చాలా ఎక్కువ. పాలకు డిమాండ్ లేని ప్రాంతమే ఉండదు. అందుకే డైరీ ఫామ్ పెట్టి పాల వ్యాపారం చేస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది విద్యావంతులైన యువకులు సైతం ఉద్యోగాలు మానేసి ఈ వ్యాపారం వైపు ద్రుష్టి కనబరుస్తున్నారు.
పాలకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. దాదాపు ప్రతి ఇంటిలో వీటి వినియోగం ఉంటుంది. అందువల్ల మార్కెటింగ్‌కు గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఒకవేళ మీకు పెట్టుబడి పెట్టేందుకు ఆర్థిక స్తోమత సహకరించకపోయినా బ్యాంకులు రుణ సదుపాయం అందిస్తున్నాయి. ప్రభుత్వాలు సైతం పాడి రైతులకు రాయితీలు అందిస్తాయి. హర్యానా వంటి రాష్ట్రాల్లో పాడి పరిశ్రమ కోసం ఎవరైనా ఆవు లేదా గేదెను కొనుగోలు చేస్తే.. ప్రభుత్వం ఒక్కో గేదెకు రూ.50 వేలు, ఆవుకు రూ.30 వేలు రుణం ఇస్తుంది. ఈ రుణం వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంది. ఆ వడ్డీని కూడా సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు. పాడిపరిశ్రమలో మంచి లాభాలు పొందాలంటే.. డిమాండ్‌తో పాటు రేట్లు ఎక్కువుగా ఉండే ప్రాంతాల్లో డైరీ ఫామ్‌ని ప్రారంభించాలి. తక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో కాకుండా.. పెద్ద నగరాలకు సమీపంలో డెయిరీని ప్రారంభిస్తే అధిక లాభాలు ఆర్జించవచ్చు. మొదట తక్కువ పశువులతోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి. అనంతరం డిమాండ్ కు తగ్గట్టుగా పశువుల సంఖ్యను పెంచుకోవచ్చు.
ఈ వ్యాపారం ఆరభించాలనుకునేవారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యవిషయం.. డెయిరీ ఫామ్ ఎక్కడ ఏర్పాటు చేయలనుకుంటున్నారో అన్నదే. ఇదే ఈ వ్యాపారానికి అసలు పునాది. వ్యాపారం ప్రారంభించే ముందుగా ఆ ప్రాంతంలో సర్వే చేసి, స్థానికుల అభిప్రాయం తీసుకోవాలి. ఆవు, గేదె పాలలో వేటిని ఎక్కువగా వినియోగిస్తున్నారో తెలుసుకోవాలి. ఆ డిమాండ్ కు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలి. ఆవులు, గేదెలు రెండింటిని ఉంచుకుంటే ఇంకా మంచిది. ముర్రా జాతి గేదెలు పాలు ఎక్కువగా ఇస్తాయి. ఆవుల్లో జెర్సీ జాతి ఆవులను కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ రెండు రకాలు ఎక్కువ కాలం పాటు.. అధిక మొత్తంలో పాలు ఇస్తాయి.
మార్కెట్లో మంచి మేలురకం గేదె కావాలంటే కనీసం 70 వేలు వెచ్చించాలి. అదే మంచి పాలిచ్చే ఆవు కావాలంటే రూ.45వేల వరకు ఉంటుంది. మూడు గేదెలు, రెండు ఆవులను కొనుగోలు చేసి.. డైరీ ఫామ్‌ని ప్రారంభించవచ్చు. అలాగే, ఆవులు, గేదెల నివాస స్థలం సరైనది ఏర్పాటు చేసుకోవాలి. వీటి కోసం పచ్చి, ఎండుగడ్డి ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇలా చిన్న స్థాయిలో డైరీ ఫామ్‌ను ఏర్పాటు చేసేందుకు మీరు 4 నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
సాధారణంగా ఒక గేదె రోజుకు 12 లీటర్లు, ఆవు అయితే 18 లీటర్ల వరకు ఇస్తుంది. మొత్తం ఐదు పశువుల కొనుగోలు చేశారనుకుంటే రోజుకు దాదాపు 80 నుంచి 90 లీటర్ల పాలు సేకరణ సాధ్యమవుతుంది. వీటిని మీరే నేరుగా వినియోగదారుడికి లీటరు రూ.70కి విక్రయించినా.. రోజుకు 6 వేల పైబడి ఆదాయం ఆర్జించవచ్చు. కనీసం 5 వేలు వచ్చాయనుకున్నా.. నెలకు లక్షా యాభై వేల రూపాయలు వస్తాయి. ఇందులో పశుగ్రాసం, ఇతర ఖర్చుల కింద 80 వేల వరకు తీసేసినా.. మీకు రూ.70వేలు సులభంగా మిగులుతాయి. కావున వ్యాపారంలో స్థిరపడాలనుకునేవారు చిన్నతనంగా ఆలోచించకుండా ఈ వ్యాపారం ప్రారంభించి జీవితంలో స్థిరపడండి.
గమనిక: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుని వారు ముందుగా సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.