దేశంలో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట స్మార్ట్ టీవీలు సర్వసాధారణం అయ్యాయి. అయితే మధ్యతరగతి కుటుంబాలు.. ఎల్‌ఈడీ టీవీకి మారాలనుకునే టాటా బ్రాండ్ క్రోమా పేరుతో శుభవార్త తీసుకు వచ్చింది. ఇక దేశంలో టాటా అంటే ఒక గొప్ప బ్రాండ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేరుకు తగ్గట్లుగానే టీవీని లాంచ్ చేసింది. కేవలం తొమ్మిదివేలకే లభించే టీవీని లాంఛ్ చేసింది. ఒక సంవత్సరం గ్యారెంటీ ఉండటంతో పాటు టాటా బ్రాండ్ గురించి ప్రత్యకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది స్మార్ట్ టీవీలను ప్రిఫర్ చేస్తున్నారు. ఈ టీవీలు క్రోమా స్టోర్స్ అన్నింటా లభిస్తున్నాయి.
ఇటీవల కాలంలో క్రోమా కి ఎలాంటి స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. స్వతంత్ర ఉత్పత్తిదారులతో కలిసి ఒక సొంత బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. అంతే కాదు క్రోమా ఉత్పత్తులు అన్ని రకాలుగా టెస్టులు చేసిన తర్వాతనే మార్కెట్ లోని పంపుతారు. ఇప్పుడు టాటా బ్రాండ్ కి సంబంధించిన టీవీ కనుక ఇది మద్యతరగతి కుటుంబాల వారికి మంచి శుభవార్తే అని చెప్పొచ్చు. ధర తక్కువ అయినా అత్యుత్తమ క్వారిటీ క్రోమా సొంతం అని చెప్పుకోవచ్చు.