‘ఎలక్ట్రిక్ వాహనాల వాడకం’లో ప్రపంచంలోనే తొలి పుణ్యక్షేత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించబోతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు తిరుపతి నుంచి తిరుమలకు వందలాది ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తుంటాయి. ఆహ్లాదకరంగా కనిపించే తిరుమల ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువే. నిత్యం భారీగా తరలివచ్చే భక్తులు ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకుంటారు. రోజూ పది వేలకు పైగా వాహనాలు ఘాట్ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఆర్టీసి విషయానికి వస్తే.. రాష్ట్రంలోనే ఇంధన వ్యయానికి సరిపడా రాబడిని తెచ్చిపెడుతూ ఏపీలో రెండోస్థానంలో తిరుమల ఆర్టీసీ విభాగం ఉంది. కాలుష్యం వెదజల్లే వాహనాలకు చెక్ పెట్టి కాలుష్యరహిత వాహనాల వినియోగానికి టీటీడీ అధికారులు శ్రీకారం చుట్టారు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని చూస్తున్నది టీటీడీ. ఇప్పటికే కొన్ని బస్సులను ప్రయోగాత్మకంగా నడిపినట్టు తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ నుంచి 35 ఎలక్ట్రిక్ కార్లను అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. ఒక్కోకారుకు నెలకు 32వేల రూపాయలు చెల్లించనుంది టీటీడీ. ఐదేళ్లు అద్దె చెల్లించిన తర్వాత ఎలక్ట్రిక్ కార్లు టీటీడీ సొంతం కానున్నాయి. ప్రస్తుతానికి మొత్తం 35 కార్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమలలో విధులు నిర్వర్తించే అధికారులకు వీటిని కేటాయించనున్నట్లు టీటీడీ పేర్కొంది.ఇప్పటికే ఆర్టీసీ ద్వారా కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఘాట్ రోడ్డులో నడపాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. టీటీడీ వినియోగించే వాహనాలను కూడా దశల వారీగా ఎలక్ట్రికల్ వాహనాలను మార్చాలనుకుంటోంది.
18 లక్షల రూపాయలు విలువ చేసే టాటా నెక్సన్ కారును కొనుగులు చేసిన టీటీడీ అధికారులు ట్రయల్ చూశారు. వాహనం బాగుండడంతో 35 టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ వాహనాలను టీటీడీ కొనుగోలు చేసింది.
మరిన్ని వివరాలకోసం ఈ వీడియో చూడండి.