ఈరోజుల్లో మొబైల్ ఫోన్ మన దగ్గర ఉందంటే ప్రపంచం మన అర చేతిలో ఉన్నట్లు లెక్క. కాకుంటే.. మొబైల్ కు ఉన్న అతి పెద్ద సమస్య త్వరగా ఛార్జింగ్ అయిపోవడం. ఓ రెండు గంటలు ఇంటర్నెట్ ఆన్ లో ఉన్నా, గూగుల్ మ్యాప్స్ వంటి అప్లికేషన్స్ ఓపెన్ చేసినా.. ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో మనకు సహాయం చేసేవి.. పవర్ బ్యాంక్‌లు. ప్రయాణాలు చేసేటపుడు వీటి అవసరం ఎక్కువుగా ఉంటుంది. వీటితో ఎంచక్కా ప్రయాణం చేస్తూనే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాంటి బెస్ట్ అనిపించే.. కొన్ని పవర్ బ్యాంక్‌లను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చింది కోనేయండి.
తక్కువ ధరలో లభించే పవర్ బ్యాంక్‌లలో ఎంఐ మొదటి స్థానంలో ఉంటుంది. ఇది పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంక్. ట్రిపిల్ అవుట్ ఫుట్ పోర్ట్ తో పాటు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ పవర్ బ్యాంక్ సొంతం. ఈ పవర్ బ్యాంక్ ఆరు గంటల్లో పూర్తి చార్జ్ అవుతుంది. ఇది 20000 mAh పవర్ బ్యాటరీతో లభిస్తుంది. చాలా తేలిక ఉంటుంది. ఎక్కడికైనా సులువుగా తీసుకోవచ్చు. దీనిని కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది 20000 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ కలిగిన పవర్ బ్యాంక్. 20W ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిఫుల్ అవుట్‌పుట్ పోర్ట్, టైప్ C ఛార్జింగ్ సపోర్ట్(ఇన్‌పుట్ & అవుట్‌పుట్) చేస్తుంది. దీని సాయంతో ఒకేసారి మూడు మొబైల్స్ కు ఛార్జ్ చేయొచ్చు. ఈ పవర్ బ్యాంక్‌ను ఒక సారి ఫుల్ చార్జ్ చేయడం వలన.. నాలుగు సార్లు స్మార్ట్ ఫోన్ ఫుల్ చార్జ్ చేయవచ్చు. దీనిని కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పవర్ బ్యాంక్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రూపొందించారు. కేవలం 400 గ్రాముల బరువు ఉంటుంది. ఇందులోని లో కరెంట్ ఫీచర్ ద్వారా బ్యూటూత్, హెడ్‌సెట్స్‌ను ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీనిని ఒక సారి ఫుల్ చార్జ్ చేయడం వలన.. నాలుగు సార్లు ఫోన్లను ఫుల్ చార్జ్ చేయవచ్చు. 2 ఇన్ 1 ఛార్జింగ్ కేబుల్ అంధిసున్నారు. ఈ కేబుల్ సాయంతో ఒకేసారి రెండు ఫోన్లు ఛార్జ్ చేయవచ్చు. 20000 ఎమ్ఏహెచ్ కెపాసిటీ దీని సొంతం. దీనిని కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తేలికగా ఉన్న పవర్ బ్యాంక్ కావాలి అనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు. కేవలం 300 గ్రాముల బరువు ఉంటుంది. దీన్ని 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రూపొందించారు. ఇది చాలా క్విక్ గా ఛార్జ్ అవుతుంది. టైపు సీ, మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ అవుట్‌పుట్ పోర్ట్స్ ఇచ్చారు. దీనిని కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఎమ్ఐ పాకెట్ పవర్ బ్యాంక్‌ను చాలా తక్కువ బరువుతో తయారు చేశారు. దీనిని చాలా సులువుగా జేబులో తీసుకెళ్లొచ్చు. 12 లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఫీచర్‌తో డివైజ్‌లు ఓవర్ హీటింగ్ కాకుండా జాగ్రత్తలు తీసుకొవచ్చు. 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఈ పవర్ బ్యాంక్‌తో ఒకేసారి మూడు డివైజ్‌లను ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీనిని కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.