సొంత ఇల్లు అనేది ఎంతోమంది కల. కొంతమంది 150 గజాల్లో ఇల్లు కట్టుకుంటారు. కొంతమంది 80 గజాల్లో ఇల్లు కట్టుకుంటారు. తమ స్థలాన్ని బట్టి ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. మరి ఏపీలో పలు ఏరియాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూద్దాం.
అనంతపురం, చిత్తూరు, కాకినాడ, గుంటూరు, కడప, మచిలీపట్నం, కర్నూలు, ఒంగోలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు వంటి ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలంటే తక్కువలో తక్కువ గజానికి రూ. 15,300 అవుతుంది. ఉత్తమ నాణ్యతతో కట్టుకోవాలనుకుంటే గజానికి రూ. 18,900 అవుతుంది. 80 గజాల్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే రూ. 12,24,000 నుంచి రూ. 15,12,000 అవుతుంది. యావరేజ్ క్వాలిటీతో ఇల్లు కట్టుకోవాలంటే చదరపు అడుగుకు రూ. 1700 అవుతుంది. కొంచెం మంచి నాణ్యతతో ఇల్లు కట్టుకోవాలనుకుంటే చదరపు అడుగుకు రూ. 1850 అవుతుంది. బెస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే చదరపు అడుగుకు రూ. 2,100 అవుతుంది. ఇందులో టైల్స్, గ్రానైట్, మార్బుల్ ఫ్లోరింగ్, ప్లై వుడ్ వర్క్ వస్తాయి. బిల్డర్ కి కాంట్రాక్ట్ అప్పగిస్తే మెటీరియల్, పని అతనే చూసుకుంటాడు. టెన్షన్ లేకుండా చెప్పిన తేదీకి ఇల్లు అప్పగిస్తాడు. అలా కాకుండా కేవలం మెటీరియల్ మనం పెట్టుకుంటే బిల్డర్ కి, పని వారికి సెపరేట్ గా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏపీలోని ఈ సిటీల్లో ఇల్లు కట్టుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుందో చూద్దాం.
అనంతపురం, గుంటూరు, కర్నూలు, కడప, కాకినాడ వంటి ఏరియాల్లో ఇల్లు కట్టుకోవాలంటే యావరేజ్ క్వాలిటీలో 80 గజాలకు రూ. 12 లక్షలు అవుతుంది. మంచి నాణ్యతతో కావాలనుకుంటే రూ. 13 లక్షలు అవుతుంది. అదే 150 గజాలకైతే మంచి నాణ్యతలో రూ. 25 లక్షల లోపే ఇల్లు పూర్తవుతుంది. ఈ ధరలు అన్ని ఏరియాల్లో ఒకేలా ఉండకపోవచ్చు. అలానే మెటీరియల్ కాస్ట్ కూడా ప్రాంతాలను బట్టి మారచ్చు. మరీ ఎక్కువ వ్యత్యాసం ఉండదు గానీ ఈ ధరలకు అటూ, ఇటూ ఉంటాయి. ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి. వాళ్ళు తక్కువ బడ్జెట్ లో ఇల్లు కట్టి ఇస్తుంటారు. చెప్పిన తేదీకి పూర్తి చేసి ఇస్తారు.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి ఉండవచ్చు. అవగాహన కోసం ఇవ్వబడింది మాత్రమే. పూర్తి అవగాహన కోసం స్థానిక కాంట్రాక్టర్లను సంప్రదించవలసినదిగా మనవి.