పండగ వచ్చిందంటే చాలు.. షాపింగ్ మాల్స్ జనాలతో కిటకిటలాడుతుంటాయి. పండగ వస్తోంది కదా.. కొత్త బట్టలు వేసుకోవాలన్నా కోరికేమో అనుకోకండి. కాదు.. షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు ప్రకటించే ఆకర్షణీయమైన ఆఫర్లు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏ షాప్ ముందు చూసినా, ఏ మాల్ ముందు చూసినా ఆఫర్ల బోర్డులే దర్శనమిస్తున్నాయి. upto 70% డిస్కౌంట్, అన్ని ప్రొడక్ట్స్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్, Buy 1 Get 1 Free, Buy 1 Get 2 Free, Buy 2 Get 1 Free.. ఏక్కడా చూసినా ఇలాంటి బోర్డులే. మరి.. ఏడాది మొత్తం లేనిది పండుగ సమయంలో మాత్రమే ఆఫర్లు ఎందుకిస్తారు అని ఎపుడైనా ఆలోచించారా! ఆలోచించరు. తక్కువుకు వస్తున్నాయి.. కొనేద్దాం అని పరుగులు పెడుతుంటారు. అలాంటి ఆఫర్ల వెనుక కూడా మోసాలున్నాయి. అవేంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మోసం అందరకి తెలిసిందే. అయినా ఏం చేయలేం. ఆఫర్ ప్రకటించే ముందు వస్తువు అసలు రేటును పెంచి.. దానిపై డిస్కౌంట్ ఇస్తుంటారు. ఉదాహరణకు.. ఒక ప్యాంటు ధర రూ. 1,000 అనుకోండి. దీనిపై ఆఫర్ ప్రకటించే ముందు.. దీనికి రూ. 1,600 కొత్త ట్యాగ్ జతచేస్తాడు. ఇప్పుడు ధర పెరిగింది కదా! కస్టమర్ కు నమ్మకం కలిగించడం కోసం ‘ఫ్లాట్ 40% డిస్కౌంట్’ అంటారు. జనాలు ఇవేమీ పట్టించుకోకుండా.. అబ్బా 40% అంటే.. రూ. 500 తగ్గతోంది. ఇంతకన్నా తక్కువకు ఎక్కడ కొనలేం అంటూ ఒకటి కొనడం పోయి రెండు.. మూడు కొంటుంటారు. ఇలాంటి వాటిపై ఎక్కువుగా Buy 1 Get 1 Free, Buy 1 Get 2 Free వంటి ఆఫర్లు ఇస్తుంటారు.
ఇది కూడా అందరకి తెలుసు. అయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మనుసులో అనుకుంటూ ఏదో ఒకటిలే అన్నట్లుగా కొంటారు. ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాడు అంటే.. అందులో ఈ మోసం ఉన్నట్లే. ఎవరూ కొనుగులో చేయడానికి ఇష్టపడని వస్తువులపై ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తుంటారు. ఇవి ఓల్డ్ స్టాక్ అని తెలుసుకోవడం కూడా కష్టం. కొత్తదానిలానే ఉంటాయి. కావున ఈ విషయంలో అప్రమత్తత అవసరం.
జనాల తాకిడి ఎక్కువుగా ఉన్నప్పుడు ఇలాంటి మోసాలు కూడా జరుగుతుంటాయి. మనం కనిపెట్టలేమా అంటే.. కనిపెట్టలేరు. నో ట్రయల్స్ అంటారు. అందులోనూ మొత్తం విప్పి చూద్దామా అంటే పబ్లిక్ ఎక్కువుగా ఉంటారు. ఇలాంటి వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి.
వీటితో పాటు ఆన్ లైన్ మోసాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజుల్లో షాపింగ్ మాల్స్ లో బట్టలు కొనేవారి కంటే.. ఆన్ లైన్ కొనేవారే అధికం. అలాంటి వారు సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి. నాణ్యమైన వస్త్రాలు కొనుగోలు చేసి పండగను సంతోషంగా జరుపుకోండి. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.