సంక్రాంతి పండుగ సందర్బంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. దీంతో బస్టాండ్లు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా పండుగ జరుగుపుకోవాలని వెళ్లిన వారు కొందరైతే.. జూదం, కోడి పందాలు, క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ఉంటదని వెళ్ళినవారు మరొకొందరు. ఏదైతేనేం.. సంక్రాంతి పండుగ ఏపీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ ఏడాది సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ రూ. 141 కోట్ల ఆదాయం గడించిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమలరావు తెలిపారు. […]
హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజుల పాటు ఈ పండగను జరుపుకుంటారు. సూర్యుడు మకరం రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా అందరూ జరుపుకుంటారు. ఇక సంక్రాంతి పర్వదినాన పిల్లలు, పెద్దలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు. పూజ గదిని అలకరించి, ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుళ్లను పూజిస్తారు. […]
సంక్రాంతి పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఆ ఏముంది.. తినడం తాగడమే అని చాలామంది కుర్రాళ్లు సింపుల్ గా అనేస్తారు. ఇందులో మొహమాట పడటానికి ఏం లేదు కూడా. ఎందుకంటే జరిగేది అదే కాబట్టి! ఆంధ్రాలో అయితే ఈ పండగకు ఉన్న పాపులారిటీ వేరే లెవల్. మరీ ముఖ్యంగా సంవత్సరమంతా అక్కడా ఇక్కడా ఉద్యోగాలు చేస్తూ, సొంతూరికి దూరంగా ఉన్న వాళ్లంతా.. కూడా పుట్టిన ఊరికి వస్తారు. బాబాయి, పిన్ని, అత్త, మామ అంటూ చుట్టాలందరితోనూ […]
సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద పండుగ కావడంతో నగరంలో ఉంటున్న ప్రజలందరూ పల్లెబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, రానుపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ కి ఈ రాయితీ […]
సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దులు, రంగవల్లులు, గొబ్బెమ్మలు ఎంత ప్రధానమో గాలిపటాలకు అంతే క్రేజ్. ఈ పండుగ సమయంలో పిల్లలు, పెద్దలు అందరూ గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంస్కృతి పెద్దగా కనిపించప్పటికీ, నగరంలో ఏ బిల్డింగ్ పైన చూసినా వీరే కనిపిస్తుంటారు. అయితే.. ఈసారి ఆ ఆనందం దూరమైనట్లే. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, ప్రధాన కూడళ్లు, ప్రార్థనాస్థలాలు, చుట్టు పక్కల ప్రాంతాల్లో పతంగులను ఎగురవేయడాన్ని హైదరాబాద్ పోలీసులు నిషేధించారు. ఈ నిషేధం […]
ఏడాదికి వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ.. సంక్రాంతి పండుగ వస్తుందంటేనే స్వస్థలాలకు వెళ్లాలని, మన వాళ్ల మధ్య పండుగ జరుపుకోవాలని మనస్సు ఊవిళ్లూరుతోంది. దానికి తగ్గట్లుగా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. ప్రయాణానికి సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు షాపింగ్, బహుమతులు, అక్కడ ఉండబోయే రోజులకు అయ్యే ఖర్చులన్నీ బేరీజు వేసుకుంటాం. పిల్లలను తీసుకుని ఈ పండుగ రోజుల్లో అమ్మ, అత్తవారింట్లో, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఉత్సాహం […]
సంక్రాంతి.. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పెద్ద పండగ. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లి సెటిల్ అయిన వారంతా ఈ ఒక్క పండగ కి మాత్రం తమ సొంత ఊరికి చేరుకుంటూ ఉంటారు. చుట్టాలు, స్నేహితులు మధ్య పండగ మూడు రోజులు ఆనందంగా గడపాలని తపిస్తూ ఉంటారు. ఇందుకే ఎంత కష్టం అయినా.. సంక్రాంతికి అందరూ కచ్చితంగా ప్రయాణాలు పెట్టుకుంటారు. అయితే.. ఇదే అదునుగా భావించే ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఈ గ్యాప్ లో దందాకి తెర లేపుతుంటాయి. […]
పండగలు వస్తే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ వారు దోపిడీకి పాల్పడతారు. అప్పటి వరకూ లేని టికెట్ ధరలు ఆ పండగ సీజన్ లో చూస్తారు. రద్దీ కారణంగా.. బస్సులు దొరకవన్న భయంతో ఎంత ధర ఉన్నా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుని సొంత ఊర్లు వెళ్తారు. పండగలు వచ్చాయంటే ప్రైవేట్ ట్రావెల్స్ వారి దోపిడీ రాజ్యం ఏలుతుంది. ఇక సంక్రాంతి వచ్చిందంటే సామాన్యుల కంటే ప్రైవేట్ ట్రావెల్స్ వారే బాగా పండగ చేసుకుంటారు. ఇన్నాళ్లూ అడ్డు చెప్పేవాళ్లు […]
సంక్రాంతి అంటే ఎవరికీ ఇష్టముండదు చెప్పండి. ఉద్యోగాలు, పనులు, ఇతర కారణాలతో ఇంటిని, అక్కడి వాతావరణాన్ని, అనురాగాలు, ఆప్యాయతలను మిస్ అవుతూనే ఉంటాం. దాంతో పండుగలు ఎప్పుడూ వస్తుంటాయా అని రెక్కలు కట్టుకుని వాలిపోయేందుకు ఎదురు చూస్తూ ఉంటాం. ఇలాంటి విషయాలలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలేమీ అతీతం కాదు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్షనేత, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఏడాది తన స్వగ్రామమైన చిత్తుూరు జిల్లా కుప్పంలోని నారావారిపల్లెలో […]
సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్లు, కోళ్ల పందెలతో తెలుగు రాష్ట్రాల్లో సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. దాన్ని రెట్టింపు చేసేలా స్టార్ హీరోల సినిమాలు కూడా ప్రతి పండక్కి థియేటర్లలోకి వస్తుంటాయి. ఇంతకు ముందు ఏమో గానీ ఈసారి మాత్రం బీభత్సమైన రచ్చ ఉండనుంది. ఎందుకంటే ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కానున్నాయి. మొన్న మొన్నటి వరకు వినిపించింది. అందుకు తగ్గట్లే రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడెందుకో ‘వారసుడు’ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నాడు. […]