క్రిస్మస్ పండుగ అంటే ఎక్కువగా పిల్లలకి బాగా ఇష్టం. ఎందుకంటే ఆరోజున శాంటాక్లాజ్ తాత పిల్లలకు బహుమతులు ఇస్తాడని అంటారు. శాంటాక్లాజ్ వచ్చేటప్పటికీ ఆలస్యం అవుతుంది. అప్పటి వరకూ పిల్లల మొఖంలో చిరునవ్వులు చూడకపోతే ఇల్లంతా వెలితిగా ఉంటుంది కదా. కాబట్టి శాంటాక్లాజ్ డ్రెస్ ఒకటి కొనుక్కుని.. అది వేసుకుని శాంటాక్లాజ్ లా తయారై మీ పిల్లల్ని సర్ప్రైజ్ చేసేయండి. సర్ప్రైజ్ అంటే అందులో ప్రైజ్ ఉండాలిగా. అదేనండి బహుమతులు. పిల్లలకి ఇష్టమైన బహుమతులు ఇవ్వకపోతే ఆ శాంటాక్లాజ్ వేషానికి జస్టిఫికేషన్ ఉండదు. కాబట్టి పిల్లల ముందుకి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ లు పట్టుకుని వెళ్ళండి. ఏంటి, ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలో అర్థం కావడం లేదా. మై హూనా, అందుకే కదండీ మేము ఉన్నది. పిల్లలకి నచ్చే బహుమతులు ఏంటో ఓ లుక్కేయండి కాబోయే శాంటాక్లాజ్ గారు.
ఇవి క్రిస్మస్ కానుకగా మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగే అద్భుతమైన బహుమతులు. ధర కూడా మీరు భరించగలిగే విధంగానే ఉన్నాయి. సెల్ ఫోన్లకి దూరంగా ఉంచాలంటే ఇలాంటి సృజనాత్మకత కలిగించేవి వాళ్ళకి ఇవ్వాలి. అలానే ఫిజికల్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. క్యారమ్ బోర్డు, చెస్, బ్రెయిన్ వీటా వంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా పిల్లలను చురుగ్గా ఉంచుతాయి. ఇవే కాకుండా జ్ఞానాన్ని పెంచే పుస్తకాలు కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. బిల్డింగ్ బ్లాక్స్.. ఇల్లు, భవనాలు కట్టడం లాంటివి కూడా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడం అంటే ఒక పని చేసినట్టు అనిపించేలా వారిని ప్రోత్సహించండి. ఇవే కాకుండా పిల్లలకు ఇవి బహుమతిగా ఇస్తే బాగుంటుంది అనిపించే బహుమతులు ఏవైనా ఉంటే కామెంట్ చేయండి. అలానే ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి.