తల్లిదండ్రులను గౌరవించేందుకు.. మదర్స్ డే ఫాదర్స్ డే ఉన్నాయి కదా.. మళ్ళీ ఈ తల్లిదండ్రుల దినోత్సవం ఎందుకు ? అనే డౌట్ రావొచ్చు కానీ.. తల్లిదండ్రులను వేరువేరుగా గౌరవించడం ఇష్టం లేక, మదర్స్ డే – ఫాదర్స్ డే.. రెండింటినీ కలిపి ఒకే రోజు సెలెబ్రేట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశముతో 1994 సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్” బిల్ క్లింటన్ ” పేరెంట్స్ డేను అధికారికంగా ప్రకటించారు. జీవితంలో తల్లిదండ్రుల ప్రాధాన్యతను చాటి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం.
పిల్లల కోసం తల్లిదండ్రులు పడే కష్టం, చేసే త్యాగాలు, వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు చేసే కృషిని గుర్తిస్తూ.. అందుకు గౌరవార్థంగా ఈరోజును జరుపుకుంటారు. జీవితంలో ఏ కష్టమొచ్చినా మొదట గుర్తొచ్చేది తల్లిదండ్రులే. స్వార్థంతో నిండిన ప్రపంచంలో నిస్వార్థ జీవులు తల్లిదండ్రులు మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదేమో. తల్లిదండ్రులు మీ జీవితంలో ఎంత ప్రత్యేకమైనవారో మీరు తల్లిదండ్రులకు తెలిపేందుకు.. పిల్లలు వారి తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి హ్యాపీగా ఉంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
మీకు.. ‘పేరెంట్స్ డే’కి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కావట్లేదా? అయితే.. మీకోసమే టాప్ 10 గిఫ్ట్ ఐడియాస్ ఇస్తున్నాం.. చూసి మీకు నచ్చినవి కోనేయండి.
డిజిటల్ ఫోటో ఫ్రేమ్స్
పేపర్ ఫోటోలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు అంతా డిజిటల్ మయం అయిపోయింది. చివరకు ఫోటో ఆల్బమమ్స్ కూడా డిజిటల్ వి వచ్చేశాయి. కూర్చుని పేజీలు తిరిగేసే అవసరం లేకుండా.. అలా గోడకు వేలాడి దీసి స్లైడ్షో ఆన్ చేస్తే చాలు.. వందల కొద్దీ ఫోటోలు అలా అలా మారిపోతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటాయి. ఇలా.. జ్ఞాపకాలను పది చేయడమే కుండా గోడ ఘడియారం/క్యాలెండర్ కూడా ఉపయోగపడుతాయి. వీటి ధరలు రూ.3,500 మొదలుకొని రూ.9,000 వరకు ఉంటున్నాయి.
నాన్నకు గిఫ్ట్ గా స్మార్ట్ వాచ్
నాన్న అంటనే ఒక ధైర్యం.. ఒక నమ్మకం.. ఒక త్యాగం. అందుకే ఆ పదం వింటేనే ప్రతి ఒక్కరికీ ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. మనం పుట్టినప్పటి నుండి మన ఎదుగుదల కోసం అనునిత్యం కష్టపడే నాన్న.. మన బాధ్యతను మనకు గుర్తు చేసే నిత్య గురువు. మన లక్ష్యం చేరడానికి తను ప్రతి నిమిషం తోడుగా నిలుస్తూ.. మనకు ఆత్మస్థైర్యాన్ని అందించే నాన్న.. అప్పుడప్పుడు మనతో కఠినంగా ఉంటున్నప్పటికీ, తన గుండె లోతుల్లో మాత్రం ఎంతో ప్రేమను దాచుకుంటాడు. అలాంటి నాన్నలందరికీ ఫాదర్స్ డే సందర్భంగా స్మార్ట్ వాచ్ గిఫ్ట్స్ గా ఇస్తే ఎంత బాగుంటుందో..
మనలో చాలా మంది నాన్నలు పాత తరం వాళ్లే. అంటే స్మార్ట్ వాచ్ గురించి వారికి పెద్దగా తెలియకపోవచ్చు. వారు ఎక్కువగా సాధారణ వాచ్ లను వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నకు స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇవ్వండి. ఇందులోని ఫీచర్ల గురించి వారికి తెలియజేయండి. ఈరోజుల్లో స్మార్ట్ వాచ్ టెక్నాలజీ బాగా పెరిగింది. ఫాదర్స్ డే సందర్భంగా లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ను మీ నాన్నగారికి గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.
స్మార్ట్ ఫోన్
మనం చిన్నప్పటి నుండి ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే నాన్నకు మనం ఈసారి స్మార్ట్ ఫోన్ ను కానుకగా ఇవ్వొచ్చు. స్మార్ట్ ఫోనులోనూ లేటెస్ట్ టెక్నాలజీ 5G ఫోన్ ను కొనుగోలు చేసి మీ నాన్నగారికి గిఫ్ట్ గా అందివ్వొచ్చు. మీ నాన్నగారిని టెక్నాలజీ పరంగా అప్ డేట్ అవ్వమని కోరండి. ఇది చూసిన మీ తండ్రి ఎంతగానో సంతోషిస్తారు.
అమ్మ హ్యాపీ అయ్యేలా
మీ నాన్నకు కాఫీ అంటే చాలా ఇష్టమా.. అయితే తనకు మీరు ఓ మంచి కాఫీ మేకర్ ను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. దీని వల్ల మీ తల్లిగారు కూడా ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే ప్రతిరోజూ ఆమెకు కాఫీ చేసే శ్రమ కూడా తగ్గుతుంది.
అమ్మ కోసం వాచ్
వాచ్ లను సహజంగా అందరూ గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. అయితే మీ అమ్మకు కూడా వాచీలు ఇష్టమైతే తప్పకుండా వాచ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి. దాంతో వాచ్ ధరించిన ప్రతిసారి మీరు గుర్తుకు వస్తారు. కానీ వాచ్‌ను ఎంపిక చేసే ముందు అమ్మకు ఎలాంటి మోడల్ నచ్చుతుందో అలాంటి వాటిని మాత్రమే కొనుగోలు చేయుండి. మీకోసం.. మాదో ఎంపిక.
మధుర జ్ణాపకాలు
మీ తల్లిదండ్రులతో మీకు ఉన్న మంచి తీపి గుర్తులను, మధుర క్షణాలను, జ్ణాపకాలను మీ దగ్గరే ఉంచుకోవడానికి మంచి ఫొటోలను బంధించడానికి మంచి క్వాలిటీ ఉన్న ఫొటో ఫ్రేమ్ అనేది చాలా ముఖ్యం. ఇవి ప్రతి సందర్భంలోనూ ప్రత్యేకమే. ఇలాంటి అరుదైన ఫొటోలను ఒకే చోట సెట్ చేసి ఫొటోఫ్రేమ్ గా మార్చండి. దాన్ని మీ తల్లిదండ్రులకు కానుకగా ఇవ్వండి.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గిఫ్టులను ఇవ్వొచ్చు. ఇక చివరగా ఆరోజు మీరు.. పూర్తిగా వారితోనే గడిపేందుకు ప్రయత్నించండి. మీ తల్లిదండ్రుల కోసం సమయాన్ని కేటాయించండి. వీలైతే అమ్మనాన్నలను ఓ మంచి రెస్టారెంటుకు తీసుకెళ్లండి. వారికి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసేయ్యండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.