దేశీయ అతి పెద్ద టెలికాం కంపెనీల మధ్య సమరం వినియోగదారుల పాలిట వరంగా మారింది. అతి తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వేలకు వేలకు వెచ్చించి ప్రవేట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు తీసుకోవటం కంటే రూ. 200లోపు ఉన్న ఈ సేవలు వినియోగించుకోవటం ఉత్తమం.
రెండు దిగ్గజ కంపెనీల మధ్య సమరం వినియోగదారుల పాలిట వరంగా మారుతోంది. దేశీయ అతి పెద్ద టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ పోటాపోటీగా అతి తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ లాంచ్ చేస్తున్నాయి. గత నెలలో జియో బ్యాకప్ ప్లాన్ పేరిట రూ.198కే జియో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి పోటీగా ఎయిర్‌టెల్ చౌక ధరలో రెండు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రకటించింది. ఇందులో ఒకటి రూ.199కే అందిస్తుండటం గమనార్హం.
జియో, ఎయిర్‌టెల్ మధ్య సమరం ఇప్పటిది కాదు. టెలికాం రంగంలోకి జియో ప్రవేశించిన నాటి నుండే మొదలయింది. ఇందులో ఓకే ముందుగా ఓకే ప్లాన్ తీసుకొచ్చిందంటే.. రెండో కంపెనీ నుంచి దానికి సమానమైన ప్లాన్ తప్పక లాంచ్ అవుతుంది. ఇప్పుడూ అదే జరిగింది. జియోకు పోటీగా ఎయిర్‌టెల్ చౌక ధరలో రెండు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రకటించింది. ఇందులో ఒకటి రూ.199కే అందిస్తుండగా.. మరో ప్లాన్ ధరను రూ.399గా నిర్ణయించింది. ఈ రెండు ప్లాన్లలో 10 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. రౌటర్ సైతం ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ ప్లాన్ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రూ.199 ప్లాన్: ఈ ప్లాన్‌లో 10 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. కాకుంటే ప్రారంభంలో 5 నెలల చందా(5*199)ను ఒకేసారి చెల్లించాలి. దీనికి రూ.500 ఇన్‌స్టాలేషన్ చార్జీలు కలుపుకొని మొత్తం రూ.1674 ఒకేసారి చెల్లించాలి. ఆపై ఐదు నెలల పాటు ఎలాంటి నిరంతరంగా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు.
రూ.399 ప్లాన్: ఈ ప్లాన్‌లో కూడా 10 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ లభిస్తుంది. రౌటర్ కూడా ఉచితంగా అందిస్తారు. వీటితో పాటు అదనంగా ఎక్స్‌ట్రీమ్ బాక్స్, 350 ఛానెళ్లు ఉచితంగా లభిస్తాయి. ఇందులో కూడా 5 నెలల చందా(5*399)ను ఒకేసారి చెల్లించాలి. దీనికి రూ.500 ఇన్‌స్టాలేషన్ చార్జీలు కలుపుకొని మొత్తం రూ.3,000 ఒకేసారి చెల్లించాలి. వీటితో పాటు ఎయిర్‌టెల్ రూ.499, రూ.799, రూ.999, రూ.1498, రూ.3999 ధరల్లో వివిధ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తోంది.
కాగా, జియో గత నెలలో రూ.198కే బ్యాకప్ ప్లాన్ పేరిట అతి తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద యూజర్లు 10 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్న యూజర్లు అదనంగా రూ.21 నుంచిరూ.152 వరకు చెల్లించి ఒక రోజు నుంచి ఏడు రోజుల పాటు తమ ఇంటర్నెట్ వేగాన్ని 30 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకు పెంచుకోవచ్చు. ఇందులో కూడా 5 నెలల చందాను ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా టీవీ, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.