బిగ్ బాస్ రియాలిటీ షో.. ఇప్పుడు తెలుగు టీవీ ప్రేక్షకులందరిని అలరిస్తున్న టీవీ షోలలో ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదలుపెట్టిన బిగ్ బాస్.. తెలుగులో వరుసగా 5 సీజన్లు ముగించుకొని, ప్రస్తుతం ఓటిటి వేదికగా సందడి చేసేందుకు రెడీ అయింది. తెలుగులో మంచి టీఆర్పీ రేటింగ్ దక్కించుకున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో బిగ్ బాస్ టాప్ లో ఉంటుంది. అయితే.. హిందీలో సక్సెస్ అయినటువంటి బిగ్ బాస్ ఓటిటిని తెలుగులోకి తీసుకొస్తున్నారు నిర్వాహకులు.
ఇక బిగ్ బాస్ ఓటిటి తెలుగు సీజన్ ఫిబ్రవరి 26 నుండి ‘డిస్నీ హాట్ స్టార్’ లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈసారి టీవీ వెర్షన్ లా 1-2 గంటలు కాకుండా 24 గంటలు ప్రసారం కాబోతుంది బిగ్ బాస్. డేట్ కన్ఫర్మ్ అయింది.. ప్రోమో వచ్చింది.. ఓకే. కానీ ఈసారి షోలోకి కంటెస్టెంట్స్ గా ఎవరెవరు రాబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి కొందరు సెలబ్రిటీల పేర్లు వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో కొత్తవారితో పాటు గత సీజన్లలో పాల్గొన్నవారు కూడా రానున్నారని టాక్. అయితే.. తాజాగా ఓ బోల్డ్ సోషల్ మీడియా బ్యూటీ.. అషు రెడ్డి పేరు టీవీ వర్గాలలో తెగ చక్కర్లు కొడుతోంది. అదికూడా ఓ మాజీ బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. అషు రెడ్డి పేరు కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అషు రెడ్డి ‘హ్యాపీ డేస్’ అనే టీవీ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది.
ఇటీవల రాహుల్ సిప్లీగంజ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ‘ఆల్ ది బెస్ట్ అషు.. దేనికి చెప్పానో నువ్వే అర్థం చేసుకో’ అని పోస్ట్ పెట్టాడు. అంటే.. అషు రెడ్డి బాస్ షోలోకి వెళ్తుందని చెప్పకనే చెప్పగా.. వెంటనే స్పందించిన అషురెడ్డి.. ‘నువ్వు ఎల్లప్పుడూ నా మంచి కోరే వ్యక్తివి కాబట్టి.. నన్ను విష్ చేశావేమో’ అంటూ సీక్రెట్ ని కవర్ చేసిందని నెటిజన్లు చెబుతున్నారు. ఈ విధంగా ప్రస్తుతం అషు రెడ్డి పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మరి అషు రెడ్డి బిగ్ బాస్ ఎంట్రీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.