తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1 దాదాపు ముగిసినట్లే. మరికొన్నిగంటల్లో ఈ షో విన్నర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడబోతుంది. ఈ శనివారం విజేతను ప్రకటించనున్నారు. గత సీజనల్లకు భిన్నంగా ఈ సారి ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్స్ ని గ్రాండ్ ఫినాలేకి పంపారు. యంకర్ శివ, అఖిల్, అనీల్ రాథోడ్, బిందుమాధవి, మిత్రా శర్మ, అరియానా , బాబా భాస్కర్ గ్రాండ్ ఫినాలేకి చేరుకున్నారు. ఈక్రమంలో అసలు బిగ్ బాస్ ఓటీటీ టైటిల్ విన్నర్ ఎవరు అనే వెతుకులాట ప్రేక్షకులు మొదలు పెట్టేశారు. అయితే ఈ సీజన్ విన్నర్ ఎవరు? అని లీకుల వీరులు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
బిందుమాధవి బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1 విజేత కాబోతుంది. అఖిల్ రన్నరప్ గా నిలవనున్నట్లు సమాచారం. తెలుగు బిగ్ బాస్ చరిత్రలోని తొలిసారిగా ఒక మహిళ బిగ్ బాస్ టైటిల్ దక్కడంతో బిందు అభిమానుల్లో సంతోషం వ్యక్తం మవుతుంది. గతంలో బిగ్ బాస్-4 లో కూడా అఖిల్ రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అఖిల్ రన్నరప్ గా నిలవడంతో అతని ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. అయితే అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. వీరి విషయం పక్కన పెడితే యంకర్ శివ, మిత్రాశర్మ, అరియాన విషయంలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. మిత్రాశర్మ టాప్ -3 లో ఉందని టాక్ వినిపిస్తోంది. యాంకర్ శివ రూ.25 లక్షలు తీసుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.
ఇదీ చదవండి: రూ.25 లక్షలు స్పెషల్ ప్యాకేజీ కొట్టేసిన యాంకర్ శివ?
మరో పక్క అరియానా కూడా రూ.10 లక్షలు తీసుకుని బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే శివకు రూ.25లక్షల ఇచ్చే విషయంలో మార్పులు జరుగుతాయని టాక్. డైరెక్టర్ అనీల్ రావిపూడి, నటుడు సునీల్ ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అరియానాకి రూ.10లక్షల ఆఫర్ ఇచ్చినట్లు, దానికి ఆమె ఓకే చెప్పి, ఫినాలే ఫైట్ నుంచి తప్పకున్నట్లు తెలుస్తోంది. ఒకే వేళ అరియాన పది లక్షల రూపాయలు తీసుకుంటే.. ఆ ప్రభావం బిందుకి ఇచ్చే విన్నర్ ప్రైజ్ మనీకి పై పడుతుందని సమాచారం. మొత్తం ప్రైజ్ మనీ రూ.50 లక్షల్లో.. ఈ రూ.10 లక్షల్ని మినహా ఇస్తారు.. మిగిలిన రూ.40 లక్షల్ని మాత్రమే విన్నర్‌క ఇచ్చే అవకాశం ఉంది.
ఇక ప్రస్తుత సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో ఎవరికి ఏ స్థానం దక్కిందో వరుస క్రమంలో చూద్దాం. బిందు మాధవి (విన్నర్),అఖిల్ సార్ధక్ (ఫస్ట్ రన్నర్),మిత్రా శర్మ, యాంకర్ శివ, అరియానా ,అనీల్ రాథోడ్, బాబా భాస్కర్. మరి..బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే పై సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రాయండి.