Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ 6 తెలుగు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్ల గొడవలు, అలకలు షోను ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నాయి. హౌస్‌లో జరిగే ప్రతీ విషయం ప్రేక్షకుడికి నచ్చుతుండటంతో మెల్లమెల్లగా ఫాలో అవ్వటం మొదలుపెట్టారు. ఇక, షో మొదలై ఇప్పటికే వారం రోజులు కావస్తోంది. ఈ నేపథ్యంలోనే మొదటి వారం ఎలిమినేషన్ తెరపైకి వచ్చింది. డేంజర్ జోన్‌లో ఉన్న ఆరోహీ రావు, అభినయశ్రీలలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్న టెన్షన్ మొదలైంది. అయితే, కొందరు సోషల్ మీడియా కంటెంట్ ప్రొవైడర్స్ అభినయశ్రీ ఎలిమినేట్ అయిందని తేల్చి చెప్పేశారు. ఈ వార్త దావానలంలా అంతా పాకిపోయింది. రేపు జరగబోయే ఎలిమినేషన్‌లో అభినయశ్రీ హౌస్‌నుంచి వెళ్లిపోతున్నట్లు మీడియా రాసుకొచ్చింది.
ఇక్కడే బిగ్‌బాస్ తన బ్రేయిన్‌ను వాడాడు. ఎవ్వరూ అనుకోని ట్విస్ట్‌కు తెరతీశాడు. అందరూ అనుకున్నట్లు అభినయశ్రీని ఎలిమినేట్ చేయటం లేదట. అలాగని ఆరోహీ రావును కూడా ఎలిమినేట్ చేయట్లేదట. అసలు మొదటి వారంలో ఎలిమినేషన్ ప్రసక్తే లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. మొదటి వారంలో ఎలిమినేషన్ లేకపోవటం అంటే.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్‌కు సిద్ధం చేయటమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరి, ఈ వారం ఎలిమినేషన్ లేదని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bigg Boss 6 telugu: గలాటా గీతూ గాలి తీసేసిన నాగార్జున! తొలివారమే రఫ్ ఆడించాడు!