బిగ్ బాస్ 5 తెలుగు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. బుల్లితెర ప్రేక్షకులకు రోజూ మంచి ఎంటర్‌టైన్మెంట్ దొరుకుతోంది. ఈ సీజన్ కాన్సెప్ట్‌లు, టాస్కులు చాలా వినూత్నంగా, వినోద బరితంగా ఉంటున్నాయి. అందరూ ప్రస్తావిస్తున్నది పవర్ రూమ్ గురించే. పవర్ రూమ్ పవర్స్, టాస్కులు చాలా బాగుంటున్నాయి. యాంకర్ రవి లేడీ డ్రెస్సులో చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఆర్జే కాజల్ నిద్రకోసం పడ్డపాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈసారి మొదటిరోజు నుంచే గిల్లిగజ్జాలు షురూ అయిపోయాయి.
నామినేషన్లతోనే అనుకుంటే.. కెప్టెన్సీ టాస్కుతో హౌస్ మళ్లీ హీటెక్కింది. రవి, సన్నీ మధ్య కూడా గొడవలు మొదలైనట్లే కనిపిస్తోంది. కెప్టెన్సీ కోసం సైకిల్ తొక్కడం టాస్క్‌గా ఇచ్చారు. ఈ టాస్క్ గెలిచి ‘బిగ్ బాస్ 5 తెలుగు’ తొలి కెప్టెన్‌గా ‘సిరి హన్మంత్’ కాబోతోంది. అదే విధంగా బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్ ‘ఫస్ట్ స్టోర్ మేనేజర్’గా ‘విశ్వ’ కాబోతున్నాడు. విశ్వ ఏ టాస్క్ గెలిచి స్టోర్ మేనేజర్ అయ్యాడో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే. ఈ వారం నామినేషన్స్‌లో యాంకర్ రవి, ఆర్జే కాజల్, హమీదా, మోడల్ జశ్వంత్, మానస్, సరయు ఉన్న విషయం తెలిసిందే.
(‘బిగ్ బాస్ 5 తెలుగు’కు సంబంధించిన అప్‌డేట్స్, అక్యురేట్ వార్తలు తెలుసుకునేందుకు మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి)