తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 5వ సీజన్ తుది గట్టానికి చేరుకుంది. ఈ రోజు అక్కినేని నాగార్జున బిగ్ ఇంట సందడి చేయనున్నారు. బిగ్ బాస్ ఐదో సీజన్లో ఫినాలేకు చేరుకున్న మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఎవరికి వారే తమ సత్తాను నిరూపించుకుని ఇక్కడి వరకూ వచ్చారు.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో ఇంట్లో షన్ను, సిరి వ్యవహారం మామూలుగా లేదు. వీరి ముద్దులు, హగ్గులు హద్దులు దాటిపోతున్నాయి. బిగ్ బాస్ షో ముగిసేందుకు వచ్చింది. కానీ సిరి, షన్నుల రిలేషన్ మీద క్లారిటీ రావడం లేదు. ఇక టాప్ 5లోకి వచ్చాక వీరిద్దరి రొమాన్స్ జనాలు చూడలేకపోతున్నాం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీళ్లు చేస్తున్న రచ్చ తీసుకెళ్లి అన్ సీన్లో పడేస్తున్నాడు. అందులో ఈ ఇద్దరి అరాచకం చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అంతలోనే తిట్టుకుంటారు.. అంతలోనే హగ్గులిచ్చుకుంటారు. ఇది కాస్త శృతి మించి ముద్దు సీన్ల వరకు వెళ్తుంది.
గురువారం నాడు.. బాత్రూంలో ఓ సీన్ హైలెట్ అయింది. బాత్రూంలో సిరి స్నానం చేస్తుంటుంది. షన్ను ఎంత కొట్టినా రాదు. సిరి రూల్స్ పాటించడం లేదు బిగ్ బాస్ అంటూ షన్నూ పదే పదే సిరి బాత్రూం డోర్‌ను బాదేస్తాడు. ఇక సిరి ఎంతకీ రాకపోవడంతో అడ్డుగా నేలను తూడిచే కర్రలను అడ్డంగా పెట్టేస్తాడు. సిరి బాత్ రూమ్ డోర్ తీయగానే అవి మీదపడతాయి.. ఒకింత అసహనానికి గురి అవుతుంది.
ఆ తర్వాత షన్నూ సిరిని బుజ్జగించడానికి వస్తాడు. గట్టిగా వెనకాల నుంచి హత్తుకుంటాడు. సిరి ఎంత చెప్పినా, వద్దని అన్నా.. రెడీ అవ్వాలని అన్నా కూడా వినిపించుకోడు.. ఓకే చెబితే విడుస్తానని చెబుతాడు. ఇలా నిన్నటి ఎపిసోడ్ లో సిరి సైతం ఎలిమినేషన్ అనగానే షన్నూ ఐ లవ్ యూ.. ఐ మిస్ యూ అంటూ తన మనసులో మాట చెప్పేసింది. తిరిగి ఇంట్లోకి రాగానే షన్ముఖ్ ని గట్టిగా కౌగిలించుకొని మళ్లీ రచ్చే చేసింది సిరి. ఈ విషయం ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.