‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్‌లో ఆట మంచి మలుపులు తిరుగుతోంది. ఎప్పుడు లేనిది.. ఈసారి కెప్టెన్సీ పోటీదారులుగా ఆరుగురు ఎంపిక అయ్యారు. అభయ హస్తం టాస్కులో గెలిచిన ఐదుగురే కాకుండా మరొకరికి అవకాశం కల్పించాడు బిగ్ బాస్. ఆ టాస్కులో అందరినీ ఓడించి మానస్ కెప్టెన్సీ పోటీదారుగా గెలిచాడు. కెప్టెన్సీ కోసం టాస్కులో అందరూ చాలానే కష్టపడ్డారు. ఈసారి ప్రియ లేదు కాబట్టి సన్నీని సింగర్ శ్రీరామ్ టార్గెట్ చేశాడు. ఒక్క మాట అనగానే సన్నీ ఎప్పటిలాగానే ఊగిపోయాడు. వాళ్లు ఒకింత ఫిజికల్‌గా కూడా తలపడ్డారు.
ఇదీ చదవండి: ‘సామీ సామీ’ అంటూ అలరిస్తున్న రష్మిక మందన్న.. దేవిశ్రీ మార్క్ మ్యూజిక్..
ఎప్పుడూ లేనిదీ ఈసారి షణ్ముఖ్‌లో ఒక ఫైర్ కనిపించింది. తనకి గేమ్ ఆడటం రాదు అన్న వాళ్లతో శభాష్ అనిపించుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. బాగా ఫైర్‌తో ఈ వారం మొత్తం టాస్కుల్లో పర్ఫామ్ చేశాడు. అనుకున్నట్లుగానే కెప్టెన్ అయిపోయాడు. కెప్టెన్సీ పోటీదారు టాస్కులోనూ లోబోతో తలపడిని తీరు అందరినీ ఆకట్టుకుంది. ముత్యాల వేటలో వందకు పైగా ముత్యాలు తీసి టాస్కులో గెలిచాడు. హౌస్‌లోకి వచ్చిన 50 రోజుల తర్వాత ఒక టాస్కులో గెలవడం అనేది షణ్ముఖ్‌కు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మొదటిసారి హౌస్‌లో గెలిచిన తర్వాత బాగానే ఎంజాయ్ చేశాడు. నేను గేమ్ ఆడితే ఇలా ఉంటుంది అని ప్రూవ్ చేయడానికే షణ్ముఖ్ ఈసారి కెప్టెన్ అయిపోయాడు. ఈ ఒక్కసారికే కాదు.. ఇదే ఫైర్ గేమ్ మొత్తం చూపించాలంటూ షణ్ముఖ్ అభిమానులు కోరుకుంటున్నారు. మళ్లీ రేపటి నుంచి షణ్ముఖ్ ఎప్పటిలాగానే డల్ అయిపోతాడు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.