బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలుకాగా.. ఇప్పుడు హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఈసారి బిగ్ బాస్ లో ఎలాంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు లేవు. ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఈసారి పెద్దగా సందడి కూడా లేకుండా కూల్ గా సాగిందని టాక్ వినిపిస్తుంది. మానస్, షణ్ముఖ్, సన్నీ, రవి, కాజల్ ఇలా అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనే చెప్పాలి.
ఈసారి ఇంటి నుంచి బయటకు వెళ్లేది ప్రియాంక అని గత వారం నుంచి టాక్ వినిపించింది. కానీ ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యారు. చివరి వరకు రవిని మరో కంటెస్టెంట్ తో ఉంచి అతడిని ఎలిమినేట్ చేశారు. మొదటి నుంచి రవి ఇంటి సభ్యులను తన మాటల చాతుర్యంతో ప్రభావితం చేస్తున్నాడు అంటూ ప్రతి వారం కింగ్ నాగార్జున అంటూనే ఉన్నారు. హౌస్ లో ఉన్నవాళ్లలో రవి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్. మొదటి నుంచి కూడా గ్రూప్ లో ఉన్నప్పటికీ.. తన గేమ్ ని చాలా చాకచక్యంగా ఆడుకుంటూ వెళ్తున్నాడు. కెప్టెన్ కూడా అయ్యాడు.
వాస్తవానికి ఈ వారం కూడా కెప్టెన్ అవ్వాల్సిందే కానీ.. హౌస్ మేట్స్ సహకారం లేకపోవడంతో కెప్టెన్ ఛాన్స్ మిస్ అయ్యాడు. అయితే ఇంట్లో ట్రాకుల కోసం ఇలాంటి నిర్ణయం బిగ్ బాస్ తీసుకున్నాడా అన్న అనుమానాలు వస్తున్నాయి. మానస్ – పింకి, షన్ముఖ్- సిరి వారి ఆటతీరు ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటి ప్రేక్షకుల్లో ఉండబోతున్న విషయం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? అన్న అనుమానాలు ప్రేక్షకుల్లో వస్తున్నాయి.
మరోవైపు ప్రియాంక ఇంటి నుంచి వెళ్లి పోతానా అన్న అనుమానాలు ఆమెకు కూడా వచ్చాయి.. అందుకే మానస్ కి సమయానికి ఫుడ్ తిను.. ఎక్కువగా ఆలోచించకు.. గేమ్ బాగా ఆడు అంటూ కొన్ని సూచనలు కూడా ఇచ్చింది. దాంతో ఈ వారం ఖచ్చితంగా ప్రియాంక వెళ్లి పోతుందన్న టాక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇది గమనించి బిగ్ బాస్ ఏమైనా మార్పులు చేర్పులు చేశారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇక సన్నీ, కాజల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. ఏది ఏమైనా రవి ఎలిమినేషన్ అవడం పై పలువురు సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.