‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది. ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేయడంతో మంచి సక్సెస్ అవుతోంది బిగ్ బాస్. ఈ సీజన్‌లో మొదటివారం నుంచే ఇంట్రస్టెంగ్ మొదలైన బిగ్ బాస్ అదే జోరును కొనసాగిస్తోంది. ఎప్పిటలాగానే ఇప్పుడు కూడా ఇంట్లో గ్రూపులుగానే ఉంటున్నారు. వారికి నచ్చిన వారిని వెనకేసుకు రావడం.. నచ్చని వారిని సందర్భం వచ్చినప్పుడు వారిపై అక్కసు తీర్చకోవడం జరుగుతూనే ఉంది. అలాంటి సందర్భాల్లో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి అక్షింతలు వేయడం కూడా జరుగుతుంటుంది. తాజాగా ఓ సందర్భం ఇంట్లో గ్రూపులున్నట్లు మరోసారి నిరూపిచింది. అందరూ కలిసి మోడల్ జెస్సీని వరస్ట్ పర్ఫార్మర్‌గా తేల్చి రెండోసారి జైలుకు పంపారు. అసలు ఎందుకు జెస్సీ టార్గెట్ అవుతున్నాడు ఓసారి పరిశీలిద్దాం.
హౌస్‌లో ఉన్న వారందరూ యూట్యూబ్, సినిమా, టీవీ బ్యాక్‌గ్రౌండ్‌తోనే వచ్చిన వారు. అందరికీ ఏదొక సందర్భంలో బయట పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ అవి ఇంకాస్త బల పడ్డాయి. జెస్సీ ఒక్కడే మోడలింగ్ కెరీర్ నుంచి వచ్చాడు. ఇంట్లో ఉన్న వాళ్లో అతనికి బయట ఎవరూ పరిచయం లేదు. వచ్చిన తర్వాత స్నేహం చేసే ప్రయత్నం చేశాడు కానీ అది అంత సఫలీకృతం కాలేదు. ఏదొక పాయిట్‌లో మనోడు దెబ్బయిపోయాడు. జెస్సీని అర్థం చేసుకున్నవారు అతనితో స్నేహం చేస్తున్నారు. ఓటింగ్ సందర్భాలు వచ్చినప్పుడు ప్రతిసారి అందరి కంటే జెస్సీనే టార్గెట్ అవుతుంటాడు.
జెస్సీకి పవర్ రూమ్ టాస్క్ సమయంలో యానీ మాస్టర్‌తో గొడవ జరిగింది. కాస్తో కూస్తో కాదు గట్టిగానే జరిగింది. తర్వాత జెస్సీ వెళ్లి యానీ మాస్టర్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పినా.. మాస్టర్ ఇంకా శాంతించినట్లు కనిపించట్లేదు. ఏ సందర్భం వచ్చినా జెస్సీపై ఇంకా ఆ పాత వివాదం పోలేదేమో అనిపిస్తుంది. మరోవైపు నటరాజ్ మాస్టర్‌తోనూ జెస్సీకి వివాదాలు ఉన్నాయి. చిన్నపిల్లోడు అన్నందుకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి మరీ కౌంటర్ ఇచ్చాడు. ఆ సందర్భాన్ని నాగార్జున కూడా ప్రస్తావించాడు. ఆ వివాదాల ఎఫెక్ట్ ఇంకా పోలేదని అనిరపిస్తోంది. వాళ్లను ఇష్టపడే వాళ్లు కూడా ఆ ఎఫెక్ట్‌ని జెస్సీపై చూపిస్తున్నారనే టాక్ కూడా ఉంది.
జెస్సీ హౌస్‌లో కెప్టెన్ అవ్వడం చాలా మందికి నచ్చలేదు. జెస్సీ కెప్టెన్ అవ్వడం ఏంటని నటరాజ్ మాస్టర్ వేరే వారితో చర్చ కూడా చేశాడు. గట్టిగా మాట్లాడలేని వాడు, అందరినీ ఎలా సమన్వయం చేస్తాడంటూ ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో జెస్సీ మాటను ఎవ్వరూ లెక్కచెయ్యలేదు కూడా. నెగ్గాలంటే తగ్గాలి టాస్కులో ఆదేశాలు పాటించకుండా యాపిల్ తిన్నాడు లోబో. ఆ సందర్భాన్ని చూపి జెస్సీని సంచాలక్ నుంచి తొలగించారు. ఆ తర్వాత జెస్సీ టాస్కును సరిగ్గా ఆడలేదు. ఆ వంకతోనే అందరూ జెస్సీని వరస్ట్ పెర్ఫార్మర్‌గా తేల్చారు. కానీ, అతనికి అలా జరగడానికి కారణమైన ఎవ్వరూ శిక్షను అనుభవించలేదు.
జెస్సీ ఆట చూస్తున్నా.. మనోడిని టార్గెట్ చేయడం చూసినా అందరికీ కౌశల్ గుర్తొస్తాడు. అప్పట్లో కౌశల్‌ను కూడా హౌస్‌లో ఇలానే టార్గెట్ చేసినట్లు ఆడేవారు. వారందరినీ తన స్టైల్‌లో ఎదుర్కొన్నాడు కౌశల్. ఇప్పుడు జెస్సీ కూడా మొదట్లే ఏడుపు మొహం పెట్టాడు కానీ ఇప్పుడు బానే స్పందిస్తున్నాడు. మొదటి వారమే వెళ్లిపోతాడు అనుకున్న జెస్సీ ఇంకా హౌస్‌లోనే కొనసాగుతున్నాడంటే ఎంతో కొంత అతనిలో కూడా సమర్ధత ఉంది కదా అంటూ ప్రేక్షకులు సైతం నమ్ముతున్నారు. మొదటివారం నామినేషన్ తర్వాత జెస్సీకి సూచనలు చేస్తూ కౌశల్ లేఖ రాయడం గమనార్హం. ‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్‌లో మరో కౌశల్ కాబోతున్నాడంటూ అప్పుడే టాక్ మొదలైంది కూడా.
హౌస్‌లో జెస్సీ ఎలా ఆడుతున్నాడు.. నిజంగానే జెస్సీని టార్గెట్ చేస్తున్నట్లు మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.