బిగ్ బాస్ లో ఆట మొదలైంది.. ఎవరి సెక్యూరిటీ వారే చూసుకుంటున్నారు.. మొన్నటి వరకు కలిసి మెలిసి ఉన్న ఇంటి సభ్యులు ఇప్పుడు గ్రూపులు గా విడిపోయినట్లు కనిపిస్తుంది. ‘బిగ్ బాస్ 5 తెలుగు’లో 26వ ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగింది. ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ టాస్క్ లో అందరికన్నా ఎక్కువ బరువు కోల్పోయిన మూడు జంటల వివరాలను బిగ్ బాస్ అడిగాడు. సన్నీ-మానస్ ఫస్ట్, శ్రీరామ చంద్ర-హమీదా సెకండ్, యానీ మాస్టర్-స్వేత థర్డ్ ప్లేస్‌లో ఉన్నారని సంచాలకురాలు కాజల్ తెలిపింది. ఆ జంటల్లో ఎవరు కెప్టెన్‌గా ఉండాలనే విషయంపై వారిలో వారు మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలని బిగ్ బాస్ ఫిటింగ్ పెట్టాడు. దాంతో మూడు జంటలు కొద్ది సేపు చర్చించుకున్నారు.
ఇక యానీ మాస్టర్-స్వేత పిల్లో టాస్క్ తో శ్వేత కెప్టెన్సీ పోటీకి సిద్దమైంది. ఇక శ్రీరామ చంద్ర తనకు ఇమ్యూనిటీ కావాలని హమీదాను ఒప్పించాడు. మానస్-సన్నీ మద్య కొద్ది సేపు చర్చలు నడిచాయి.. తనకు కెప్టెన్సీ కావాలని రాక రాక వచ్చిన ఛాన్సు వినియోగించుకుంటానని మానస్ ని ఒప్పించాడు సన్నీ. ఇక చివరికి స్వేత, శ్రీరామచంద్ర, సన్నీలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ ఫిజికల్‌గా మెంటల్‌గా జరిగిన టాస్క్‌ని బిగ్ బాస్ ‘కత్తులతో సావాసం’ అంటూ బిగ్ బాస్ లో ఉన్న సభ్యులు అసలు రంగు బయటపెట్టే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. కెప్టెన్ పోటీదారులుగా ఉన్న వారిలో అర్హత లేని వాళ్లు ఎవరో చెప్పి.. కత్తితో వాళ్లు ధరించిన బెల్ట్‌పై పొడవాలని కోరారు బిగ్ బాస్. ఎవరికి ఎక్కువ కత్తి పోట్లు ఉంటాయో.. వాళ్లు పోటీ నుంచి తప్పుకున్నట్టు.. తక్కువ కత్తి పోట్లు ఉన్నవాళ్లే హౌస్‌కి కెప్టెన్ అయినట్టు అని పిచ్చి టాస్క్ ఇచ్చారు. మొదట విశ్వ వచ్చి సన్నీకి కత్తి గుచ్చాడు.. ఆ సమయంలో ఇద్దరి మద్య వాగ్వాదం నడిచింది.
తర్వాత షణ్ముక్ వచ్చి కత్తి గుచ్చాడు.. ముగ్గురు నాకు స్నేహితులే అంటూనే.. సన్నీ ఆర్టిఫిషియల్‌గా నవ్వుతూ ఫేక్‌గా ఉంటున్నాడని, చిక్కుల టాస్కులో కాజల్ తమని సపోర్ట్ చేస్తున్నట్లుగా కామెంట్ చేయడం బాగోలేదని సిరి కత్తితో పొడిచింది. ఆ సమయంలో సన్నీ-సిరి కి మద్య చిన్న వాగ్వాదం జరిగింది. లోబో మాట్లాడుతూ.. నీకు ఆ టైము రాలేదు.. నువ్వు లాస్ట్ వరకు ఉంటావు.. అప్పుడు కెప్టెన్ అవుతావని చెబుతూ సన్నీని పొడిచాడు.
సన్నీని టార్గెట్ చేయడం మానలేదు ఇంటి సభ్యులు.. ప్రియ, నటరాజ్ మాస్టర్, యాంకర్ రవి, ప్రియాంక ఇలా ఒకరి తర్వాత ఒకరు కత్తితో పొడవడంతో సన్నీ కన్నీరు పెట్టుకున్నాడు.. పొంతన లేని ఆరోపణలు చేస్తూ తనని ఘోరంగా అవమానించారని హనీ మాస్టర్,మానస్, శ్రీరామ చంద్ర వద్ద కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు మాస్ సన్నీకి ధైర్యం చెబుతూ.. ఇప్పుడు బిగ్ బాస్ లో ఒక్కొక్కరి రంగు బయట పడుతుందని.. నువు మరింత స్టాంగ్ కావడానికి ఇదే టైమ్ అని చెప్పాడు. చివరికి శ్రీరామ్‌ను తక్కువమంది పొడవడంతో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.