ఈ మధ్యకాలంలో టీవీ ప్రేక్షకులను విశేషంగా ఎంటర్టైన్ చేసిన పాపులర్ రియాలిటీ షో ఏదైనా ఉందంటే.. అది బిగ్ బాస్ అనే చెప్పాలి. గత 5 సీజన్స్ నుండి విశేషంగా ఆదరణ దక్కించుకొని ఫ్యాన్ బేస్ రెట్టింపు చేసుకుంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ చాలా గ్రాండ్ గా ముగిసింది. సీజన్ 5 బిగ్ బాస్ టైటిల్ VJ సన్నీ గెలిచిన సంగతి తెలిసింది.
అయితే.. బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి హౌస్ లో పాల్గొన్న అందరూ సభ్యులు ఏదొక చోట విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ షో ముగింపు సమయానికి సభ్యులు షణ్ముఖ్ – సిరి విపరీతంగా ట్రోల్స్ కి గురయ్యారు. అందుకు కారణం కూడా ప్రేక్షకులకు తెలుసు. అయితే.. గ్రాండ్ ఫినాలేలో అందరి పేరెంట్స్ తో పాటు సిరి తల్లి శ్రీదేవి కూడా పాల్గొన్నారు.
ఫినాలేలో ఆమె మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది. బిగ్ బాస్ ఇంట్లో తన కూతురు సిరికి చెప్పిన మాటలతో అందరూ తనను తిట్టారని శ్రీదేవీ చెప్పుకొచ్చింది. అలా చెప్పకూడదని అందరూ అన్నారంటూ కంటతడి పెట్టుకుంది. అయితే హోస్ట్ నాగార్జున మాత్రం శ్రీదేవిని ఓదార్చి.. ఆమెకు సపోర్ట్ గా మాట్లాడాడు. అమ్మ చెప్పకపోతే ఇంకెవ్వరూ చెబుతారు.. మీ మనసులో ఏముందో అది చెప్పారు. దాంట్లో తప్పేం లేదని నాగార్జున భరోసా ఇచ్చాడు.నిజానికి బిగ్ బాస్ హౌస్ లో సిరి – షణ్ముఖ్ హగ్ చేసుకోవడం కారణంగానే ట్రోల్స్ కి గురయ్యారు. సిరి తల్లి శ్రీదేవి అప్పట్లో కూతురిని హెచ్చరించింది కూడా ఈ విషయంలోనే. ఇది సరైన పడ్ఢతి కాదు. మిమ్మల్ని కొన్ని లక్షల మంది చూస్తున్నారు. ఇది మంచి పడ్ఢతి కాదు అని సిరికి ఆమె తల్లి మొహం మీదే చెప్పేసింది. కానీ.., సిరి- షన్ను పద్ధతి మాత్రం మారలేదు.
అయితే.. సిరి తల్లి శ్రీదేవి అమాయకురాలు. తన మనసులో ఉన్నదే బయటకి చెప్పింది. నా బిడ్డని ఎవ్వరూ తప్పుగా అనుకోకూడదు అన్న ఆ ఆలోచన ఆ తల్లిది. కానీ.., శ్రీదేవి ఆ మాటలు చెప్పిన తరువాత నుండి షన్ను ఆమెపై సెటైర్స్ వేయడం స్టార్ట్ చేశాడు.సిరి-షన్ను ఫ్యాన్స్ కూడా.. సిరి తల్లి ఏదో తప్పుగా మాట్లాడినట్టు సీన్ క్రియేట్ చేశారు. కొంత మందిని శ్రీదేవిని తిట్టారు కూడా. అలా అన్న వారిలో సిరి ఫ్యాన్స్, స్నేహితులు, బంధువులు కూడా ఉన్నట్టు సమాచారం. కానీ.., చివరికి ఏమైంది? సిరి తల్లి ఏ విషయం గురించి అయితే ఓపెన్ గా మాట్లాడిందో ఆ విషయమే సిరి, షన్ను ఓటమికి కారణం అయ్యింది. అంటే తల్లిగా శ్రీదేవి చెప్పిన జాగ్రత్తలు కరెక్ట్ ని ప్రేక్షకులు నిరూపించారు. ఇలాంటి ఓ మంచి అమ్మ ఫినాలే రోజున కన్నీరు పెట్టుకోవడం అందరినీ కలచి వేసింది. ఇందుకే అంటారు. అమ్మ ఏమి చెప్పినా మన మంచికే అని. మరి.. సిరి తల్లి శ్రీదేవి స్వచ్ఛమైన వ్యక్తిత్వం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.