అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. కీలక దశకు చేరుకుంది. మొత్తం 19 మందితో మొదలైన సీజన్ ఇది. 14 వారాల్లో 14 మంది ఎలిమినేట్ అయ్యారు. ఒక్క జశ్వంత్ పడాల అలియాస్ జెస్సీ మినహా.. మిగిలిన వారందరూ కూడా తక్కువ ఓట్ల శాతాన్ని అందుకోవడం వల్ల బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ సీజన్లో మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఫినాలేకు చేరుకున్నారు. వీళ్లంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే కావడంతో.. ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ఇక బిగ్ బాస్ 5 సీజన్ మొదలైనప్పటి నుంచి సిరి, షణ్ముఖ్ మద్య జరుగుతున్న సన్నివేశాలు ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. వీరి మద్య హగ్గులు, గిల్లి కజ్జాలు, ముద్దు సీన్లు వెరసి వీరి మద్య ఏదో జరుగుతుందని కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక నిన్న ఇంట్లోని సభ్యులంతా సూట్ కేసులు రెడీ చేసుకుని గార్డెన్ ఏరియాలోకి రావాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ‘‘మీలో ప్రతి ఒక్కరిపై ప్రేక్షకులు తమ ప్రేమను చూపి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఫినాలేలో ప్రతి ఒక్కరు ఓటేసి వారి ప్రేమను చూపిస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లో ఒకరి ప్రయాణం ఈ రోజు ముగుస్తుంది. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లే ఆ ఒక్కరు ఎవరో మీరే చెప్పండి’’ అని బిగ్ బాస్ అడిగాడు.
ఇదీ చదవండి : ప్రభాస్ రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుకకు వాళ్లే అతిధులు
ఈ క్రమంలో బిగ్‌బాస్ అనూహ్యంగా సిరి ఇంటి నుంచి వెళ్తుందని ప్రకటించడంతో ఆమె, షణ్ను ఏడ్చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్తూ.. షన్నును గట్టిగా హగ్ చేసుకుంది. దీంతో షన్ను ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. వెళ్తూ.. వెళ్తూ.. షన్నుకు ‘ఐ లవ్ యూ’, ‘ఐ మిస్ యూ’ అని చెప్పింది. ఇన్నాళ్లు వీరిద్దరి మద్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో నిన్నటి తో తేలిపోయింది. సిరి బయటికి వెళ్లిన తర్వాత గేటు వద్ద కూర్చోని షన్ను గుక్కపెట్టి ఏడ్చాడు. కొన్నాళ్లుగా వీరి మద్య స్నేహం ఇప్పుడు నిజంగా ప్రేమగా మారిందా అన్న అభిప్రాయంలో ప్రేక్షకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సిరిని ఎలిమినేట్ చేయకుండా కన్ఫెషన్ రూమ్‌లో కూర్చోబెట్టి షణ్ను ఏడుస్తున్న వీడియో చూపించాడు బిగ్‌బాస్. షణ్ను కంటతడి పెట్టుకోవడాన్ని చూసి సిరి బోరున విలపించింది.
ఏది ఏమైనా వీరిద్దరి మద్య ఫ్రెండ్ షిప్ అంటున్నా.. ఈ ఏమోషన్స్ చూస్తుంటే నిజంగా ప్రేమాయణం నడుస్తుందా అన్న విషయాన్ని బిగ్ బాస్ సిరి ఫేక్ ఎలిమినేషన్ ద్వారా ఆడియన్స్ కి తెలియజేయాలని అనుకున్నారా అంటూ ఆడియన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. బయటకు వెళ్లిన కాసేపటికే తిరిగి ఆమెను హౌస్‌లోకి పంపించారు. దీంతో సిరి ఆనందంతో వెళ్లి షణ్నును హత్తుకుని ముద్దులు పెట్టింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.