బిగ్ బాస్‌లో గురువారం ప్రసారమైన 89వ ఎపిసోడ్లో ‘టికెట్ టు ఫినాలే’ ఆట కొనసాగింది. టికెట్ టు ఫినాలే రెండో దశలో భాగంగా జరిగిన టాస్క్ లో మానస్ మొదటిస్థానంలో నిలిచాడు. షణ్ముఖ్ 2, సిరి 3, శ్రీరామ్ 4, ప్రియాంక 5, కాజల్ 6, సన్నీ ఏడోస్థానంలో నిలిచారు. టాప్ 3లో ఉన్నాం అంటూ సిరి షణ్ముఖ్ మరోసారి హగ్ చేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటి నుంచి హౌస్ లో షణ్ముఖ్, సిరి ఇద్దరు కలిసి ఉండటం, కలిసి ఆడటం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, హగ్గులు, ముద్దులతో రచ్చ చేస్తున్నారు. ఐస్ టాస్క్‌లో భాగంగా.. సిరికి గాయాలయ్యాయి.. ఆమెతో పాటు శ్రీరామ్ కూడా గాయాలయ్యాయి. ఇక సిరి మంచం దిగకపోవడంతో షణ్ముఖ్ ఆమెను ఎత్తుకుని తిప్పుతున్నాడు.
సిరిని కాలు కిందపెట్టకుండా చూసుకుంటున్నాడు. అంతే కాదు ‘టికెట్ టు ఫినాలే’తన ఆట ఓడినా.. సిరిని మాత్రం గెలిపించాడు షణ్ముక్. ‘టికెట్ టు ఫినాలే’ 3వ టాస్క్‌లో సిరి, శ్రీరామ్‌లకు ఆడే అవకాశం రాలేదు. వారి కాళ్లకు గాయాలు కావడం వల్ల.. ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది. సిరి తాను స్వయంగా వెళ్లి ఆడతానని ముందుకొచ్చింది. కానీ బిగ్ బాస్ అందుకు ఒప్పుకోలేదు. వారికి బదులుగా వేరే వాళ్లను ఆడేందుకు ఎంపిక చేసుకోవాలని సిరి, శ్రీరామ్‌లకు బిగ్ బాస్ చెప్పాడు. దీంతో సిరి తన ఫ్రెండ్ షన్ముఖ్ పేరు చెప్పింది. శ్రీరామ్.. సన్నీని ఆడమని కోరాడు. మూడో టాస్క్ ప్రకారం.. ఓ స్లైడ్‌లో ఉన్న బాల్స్‌ను కేవలం నీటిని పోస్తూ బయటకు తీయాలి. బాల్స్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత బెల్ కొట్టాలి. సన్నీ 20 సెకన్లలో పూర్తి చేసి బెల్ కొట్టగా.. షన్ను 22 సెకన్లలో పూర్తి చేశాడు. 2 సెకన్ల తేడాతో పాయింట్లను కోల్పోయి ఫినాలే ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నాడు.
సిరికి మాత్రం ఈ టాస్కులో మంచి పాయింట్లే వచ్చాయి. దీంతో షన్ను.. సిరిని గెలిపించి.. తాను ఓడినట్లయ్యింది. ఏది ఏమైనా సిరి కోసం షణ్ముఖ్ ఆడిన తీరుబాగున్నా.. బయట మాత్రం ఫ్యాన్స్ ఒకింత నిరాశతో షన్నూపై కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా తన ఆట తీరు మార్చుకుంటాడా.. చివరి వరకు తనకోసం గేమ్ ఆడతాడా అన్న విషయంపై ఫ్యాన్స్ లో చర్చలు నడుస్తున్నాయి. షణ్ముఖ్ ఆట తీరు పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.