తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ నాలుగో రోజు పూర్తయిన నేపథ్యంలో ఇంటి సభ్యులు ఆట అప్పుడే మొదలు పెట్టారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్ లో గిల్లి కజ్జాలు.. గ్రూపులు.. ఎడుపులు మొదలు కాగా.. ఎమోషన్ సీన్లు.. బిగ్ బాస్ పై కోపాలు కూడా మొదలయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చినప్పటి నుంచి తనదైన కామెడీతో అందరినీ ఆకట్టుకుంటున్న లోబో నిన్నటి ఎపిసోడ్ లో అసహనానికి గురయ్యారు. ఇప్పటికే షణ్ముఖ్ బిగ్ బాస్ గేమ్ ఆడటం నావల్లకాదు.. బయటకు వెళ్లి వీడియోలు చేసుకుంటా అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా లోబో కూడా అదే బెటర్ అంటున్నాడు.. బిగ్ బాస్ నా వల్లకాదు అంటూ ఎమోషనల్ అయ్యాడు. సిరి ఇచ్చిన టాస్క్ తో షణ్ముఖ్‌కి సేవకుడిగా ఉన్న లోబోకి పనులు చెప్పడం.. దానికి తోడు రవి ప్రతిసారి కలగజేసుకొని విసిగించడంతో లోబోకి చిరాకు పుట్టింది. ఈ నేపథ్యంలోనే విశ్వ దగ్గరకు వెళ్లిన లోబో..బిగ్ బాస్ గేమ్ నాకు నచ్చడం లేదు.. నాకు సెట్ కావు.. నేను నా లెక్కనే ఉంటున్నా.. ఇది నా టేస్ట్ కాదు.. అందుకే నాకు ఈ బిగ్ బాస్ నచ్చడం లేదు. పోయి నా దుకాణంలో ఉంటా’ అని ఫీల్ అయ్యాడు లోబో. గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా బిగ్ బాస్ గురించి ఇలాంటి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
ఆ వీడియో ఈ మద్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే బిగ్ బాస్ లో ఎంతో ఉత్సాహంగా వచ్చి కొద్ది రోజులకే ఎమోషన్ అయి బిగ్ బాస్ నుంచి వెళ్లిపోతా.. నన్ను పంపించండి అంటూ నటుడు సంపూర్ణేష్ బాబు.. అమ్మ రాజశేఖర్, గంగవ్వ కూడా ఇలాగే ఏమోషన్ అయిన విషయం తెలిసిందే. మరి లోబో అన్నీ తట్టుకొని ఎలిమినేషన్ అయ్యే వరకు ఉంటాడా.. లేదా అన్నది ముందు ముందు చూడాలి.